Gullak Season 5: ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా 'గుల్లక్'. నార్త్ ఇండియాలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం (మిశ్రా ఫ్యామిలీ) చుట్టూ తిరిగే ఈ సిరీస్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు వచ్చిన నాలుగు సీజన్లు బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగా, తాజాగా ఐదో సీజన్‌కు (Gullak Season 5) సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోనీ లివ్' (Sony LIV) ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది.
గుల్లక్ సీజన్ 5 కమింగ్ సూన్

"ఇది కేవలం నిరీక్షణ మాత్రమే కాదు.. కొత్త కథల తలుపు తట్టడం" (Yeh sirf intezaar nahi, naye kisson ki dastak hai) అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'గుల్లక్ సీజన్ 5' త్వరలోనే కేవలం సోనీ లివ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుందని ఈ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.
సాధారణ మధ్యతరగతి ప్రజల కష్టసుఖాలు, చిన్న చిన్న కోపతాపాలు, పేచీలు, వాటన్నింటినీ మించిన ప్రేమ, ఆప్యాయతలను అత్యంత సహజంగా తెరమీద ఆవిష్కరించడం ఈ సిరీస్ స్పెషాలిటీ.
సంతోష్ మిశ్రా, శాంతి మిశ్రా, వారి ఇద్దరు కొడుకులు అన్నూ, అమన్‌ల మధ్య నడిచే సంభాషణలు ప్రతి ఇంట్లో జరిగే కథలాగే అనిపిస్తాయి. జమీల్ ఖాన్, గీతాంజలి కులకర్ణి, వైభవ్ రాజ్ గుప్తా, హర్ష్ మయార్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు రాబోయే ఐదో సీజన్‌లో మిశ్రా ఫ్యామిలీ ఎలాంటి కొత్త కథలతో మన ముందుకు రాబోతోందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'గుల్లక్' సీజన్ 5 ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?
{{/usCountry}}ప్రశ్న: 'గుల్లక్' సీజన్ 5 ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?
{{/usCountry}}జవాబు: గుల్లక్ సీజన్ 5 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV)లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
ప్రశ్న: 'గుల్లక్' వెబ్ సిరీస్ కథాంశం ఏమిటి?
జవాబు: ఇది 'మిశ్రా' అనే ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే రోజువారీ సంఘటనలు, కష్టసుఖాలు, ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఒక క్యూట్ ఫ్యామిలీ డ్రామా.
ప్రశ్న: గుల్లక్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రధారులు ఎవరు?
జవాబు: జమీల్ ఖాన్ (సంతోష్ మిశ్రా), గీతాంజలి కులకర్ణి (శాంతి మిశ్రా), వైభవ్ రాజ్ గుప్తా (అన్నూ), హర్ష్ మయార్ (అమన్) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.