Rajinikanth Auto: దటీజ్ రజనీకాంత్.. లగ్జరీ కారు వదిలేసి ఆటోలో షూటింగ్‌కు వచ్చిన తలైవా.. ఫ్యాన్స్ ఫిదా
Rajinikanth Auto: రజనీకాంత్ ఆటోలో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. మైసూరులో తన నెక్ట్స్ మూవీ ధర్మన్ షూటింగ్ సందర్భంగా లొకేషన్ కు కారులో కాకుండా ఆటోలో వచ్చి ఆశ్చర్యపరిచారు. దీంతో అక్కడున్న అభిమానులు కేరింతలు కొట్టారు.
Rajinikanth Auto: మైసూర్ షూటింగ్ లొకేషన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అశ్వథ్ మారిముత్తు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా 'ధర్మన్' (Dharman) సెట్స్‌కి రజనీకాంత్ సాధారణ ఆటో రిక్షాలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోట్ల పారితోషికం తీసుకునే గ్లోబల్ స్టార్ ఇలా ఆటోలో ల్యాండ్ అవ్వడంతో అభిమానులు షాక్ తిన్నారు.

గ్లోబల్ వైడ్‌గా అపారమైన ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సెక్యూరిటీని ఆపి.. ఫ్యాన్స్‌కి 'బాబా' పోజ్
తలైవా రజనీకాంత్ మైసూర్‌లో జరుగుతున్న 'ధర్మన్' అవుట్‌డోర్ షూటింగ్‌లో పాల్గొన్నారు. రజనీకాంత్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు సెట్స్ బయట క్యూ కట్టారు. అయితే ఆయన తన లగ్జరీ కార్లను పక్కన పెట్టి, సెక్యూరిటీ కాన్వాయ్ నడుమ సింపుల్‌గా ఆటో రిక్షాలో రావడం చూసి జనాలు కేకలు వేశారు.
ఆటో దిగిన తర్వాత అభిమానుల కేరింతలు ఎక్కువ అవ్వడంతో సెక్యూరిటీ సిబ్బంది మెయిన్ గేట్ లాక్ చేయడానికి ట్రై చేశారు. కానీ రజనీకాంత్ వెంటనే వారిని వారించి.. మెరూన్ షర్ట్, దోతి డ్రెస్సింగ్‌లో బయటకు వచ్చారు. తన ఐకానిక్ 'బాబా' హ్యాండ్ సింబల్ చూపిస్తూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నమస్కారం చేస్తూ పలకరించారు.
'ధర్మన్' సెట్స్‌లో తెలుగు స్టార్లు.. రామ్ పోతినేని, శ్రీలీల ఎంట్రీ?
ఈ ఆటో వీడియోల కంటే పెద్ద సర్ ప్రైజ్ ఏంటంటే.. 'ధర్మన్' సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నట్లు వార్తలు రావడం. యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని పిక్స్ లీక్ అయ్యాయి.
మైసూర్ సెట్స్‌లో శ్రీలీల సాంప్రదాయ పట్టు పావడాతో కనిపించిన ఫోటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే రాశీ ఖన్నా తన సోషల్ మీడియాలో రజనీకాంత్, రామ్ పోతినేనితో ఉన్న ఫోటోను షేర్ చేసి, ఆ తర్వాత రామ్ క్యాస్టింగ్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదని గ్రహించి వెంటనే డిలీట్ చేసింది. కమల్ హాసన్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో ఈ తెలుగు కాంబో ఉంటే మాత్రం రచ్చ రంబోలే అని చెప్పొచ్చు.
'ద డెడ్లీ డాక్టర్'.. కమల్ హాసన్ ప్రొడక్షన్ పిచ్చి హైప్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వథ్ మారిముత్తు ఈ భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. సిమ్రన్, యోగి బాబు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజనీకాంత్ డాక్టర్ స్క్రాబ్స్ డ్రెస్ వేసుకుని, చేతిలో రక్తం ఓడుతున్న స్కాల్పెల్‌తో కనిపించారు. చుట్టూ మృతదేహాలు పడి ఉన్న ఈ పోస్టర్ 'ద డెడ్లీ డాక్టర్' అనే టాగ్ లైన్‌తో హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మైసూర్ షెడ్యూల్ తర్వాత త్వరలోనే ఈ మూవీ క్యాస్టింగ్ గురించి మేకర్స్ అధికారిక క్లారిటీ ఇవ్వనున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


