Rajinikanth: ఈ స్టార్‌డమ్ కంటే ఆ కండక్టర్ జాబే ఎక్కువ ఇష్టపడతాను.. ఇప్పటికీ మిస్ అవుతున్నాను: రజనీకాంత్

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టార్ డమ్ కంటే కండక్టర్ గా ఉన్న రోజులనే ఎక్కువగా ఆస్వాదించినట్లు చెప్పడం గమనార్హం. జైలర్ 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా సన్ నెక్ట్స్ ఓటీటీ స్పెషల్ షో తలైవా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Published on: Oct 12, 2026, 18:12:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rajinikanth: తమిళ సినిమా రంగంలో తలైవాగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన వినయపూర్వక స్వభావం గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2' (Jailer 2) చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rajinikanth: ఈ స్టార్‌డమ్ కంటే ఆ కండక్టర్ జాబే ఎక్కువ ఇష్టపడతాను.. ఇప్పటికీ మిస్ అవుతున్నాను: రజనీకాంత్
Rajinikanth: ఈ స్టార్‌డమ్ కంటే ఆ కండక్టర్ జాబే ఎక్కువ ఇష్టపడతాను.. ఇప్పటికీ మిస్ అవుతున్నాను: రజనీకాంత్

సన్ నెక్ట్స్‌లో జైలర్ 2 సూపర్ షో

ఈ జైలర్ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఎలాంటి సాధారణ ఆడియో లాంచ్‌లు నిర్వహించకుండా, సన్ నెక్స్ట్ (Sun NXT) వేదికగా ఒక స్పెషల్ 'సూపర్ షో'ను స్ట్రీమింగ్ చేశారు.

ఈ షోలో నెల్సన్.. రజనీకాంత్‌ను ఆయన అసాధారణ వినయం గురించి ప్రశ్నించగా, తలైవా ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. తనకు వచ్చిన స్టార్‌డమ్ కంటే తాను గతంలో చేసిన బస్ కండక్టర్ ఉద్యోగంతోనే ఎక్కువగా గుర్తింపు ఆశిస్తానని ఆయన ఎమోషనల్ అయ్యారు.

బెంగళూరు కండక్టర్ రోజులను మిస్ అవుతున్నా

నెల్సన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "చూడండి, నేను పెద్ద స్టార్‌ని కావచ్చు. నాకు నటన అంటే చాలా ఇష్టం. కానీ దానికంటే ఎక్కువగా నేను కండక్టర్ గా ఉన్న రోజులను ఇష్టపడేవాడిని. నేను బెంగళూరులో ఐదేళ్ల పాటు బస్ కండక్టర్‌గా పనిచేశాను. ఆ రోజులను ఇప్పటికీ మిస్ అవుతూనే ఉన్నాను. నన్ను నేను ఎప్పుడూ ఒక స్టార్‌లా భావించుకోలేను" అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తాను తరచూ బెంగళూరు వెళ్లడానికి కూడా ఇదే కారణమని చెబుతూ.. "ఈ స్టార్‌డమ్ అంతా ఓకే. కానీ నిజం చెప్పాలంటే, నేను నన్ను ఒక కండక్టర్‌గానే ఎక్కువగా గుర్తించుకుంటాను. అందుకే నేను తరచూ బెంగళూరు వెళ్తుంటాను. కండక్టర్లు అన్ని రకాల వాళ్లతో డీల్ చేస్తుంటారు. నేను నన్ను ఒక బస్ కండక్టర్‌లాగే చూసుకుంటాను. కాబట్టి మీలాంటి పెద్ద పర్సనాలిటీ ముందు నా లాంటి సాధారణ కండక్టర్ ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఉంటాను" అంటూ నవ్వులు పూయించారు.

సిల్వర్ స్క్రీన్ రారాజు ప్రయాణం అసాధారణం

బెంగళూరులో ఒక సాధారణ మరాఠీ కుటుంబంలో శివాజీ రావు గైక్వాడ్‌గా జన్మించిన రజనీకాంత్.. చిన్నతనంలో రామకృష్ణ మఠంలో వేదాలు అభ్యసించారు. అక్కడే ఆయనకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. చదువు పూర్తయిన తర్వాత జీవనం కోసం కూలీగా, బస్ కండక్టర్‌గా అనేక రకాల చిన్న ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆయనే రజనీకాంత్‌కు లైఫ్ ఇచ్చి, పేరు మార్చి ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

కేవలం సినిమాల్లో నటించడం కోసమే తమిళ భాషను ప్రత్యేకంగా నేర్చుకున్న రజనీకాంత్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్‌గా నిలిచారు. గతేడాది 'జైలర్' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు దాని సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. దీనితో పాటు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో 'ధర్మన్' సినిమా కూడా ఆయన లైన్‌లో పెట్టారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More