Rajinikanth: 24 గంటల్లోనే 20 కోట్లు.. తలైవా రజనీకాంత్ మేనియా!

Rajinikanth Jailer 2 Advance Booking Collection: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రజినీ మేనియా ఏంటో మరోసారి నిరూపించింది.

Published on: Oct 11, 2026, 12:06:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rajinikanth Jailer 2 Advance Booking Collection: బాక్సాఫీస్ వద్ద తలైవా రజనీకాంత్ హవా మళ్లీ మొదలైంది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా ప్రీ-సేల్స్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

24 గంటల్లోనే 20 కోట్లు.. తలైవా రజనీకాంత్ మేనియా!
24 గంటల్లోనే 20 కోట్లు.. తలైవా రజనీకాంత్ మేనియా!

ఓవర్సీస్‌లో రజనీ క్రేజ్ పీక్స్!

గతంలో వచ్చిన 'జైలర్' మొదటి భాగం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న 'జైలర్ 2' పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 10న భారతదేశంలో ముందస్తు టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఓవర్సీస్‌లో అంతకంటే ఒక్కరోజు ముందే బుకింగ్స్ తెరుచుకున్నాయి.

ఆదివారం (అక్టోబర్ 11) ఉదయానికి అందిన వివరాల ప్రకారం, విదేశీ మార్కెట్లలోనే జైలర్ 2 సినిమాకు దాదాపు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 17 కోట్లు) కంటే ఎక్కువ ప్రీ-సేల్స్ నమోదు కావడం విశేషం.

దేశీయంగా రూ. 4 కోట్లు దాటిన ప్రీ-సేల్స్

ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్ల కౌంట్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ, మొదటి రోజే రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మొదటి రోజు (అక్టోబర్ 15) షోల కోసమే రూ. 3.53 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి.

తమిళనాడులో అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతుండటంతో దేశీయ బుకింగ్స్‌లో 90 శాతం వసూళ్లు ఒక్క తమిళనాడు నుంచే రావడం గమనార్హం. కేవలం చెన్నై నగరంలోనే రూ. 1.63 కోట్ల టికెట్లు ముందస్తుగా అమ్ముడయ్యాయి. అక్టోబర్ 11న కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, హిందీ బెల్ట్‌లో బుకింగ్స్ జోరందుకుంటే ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది.

హృతిక్ రోషన్ ఉనికిపై ఉత్కంఠ.. అదనపు ఆకర్షణగా మల్టీస్టారర్ కాస్టింగ్!

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన జైలర్ 2 చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మొదటి భాగంలో మెరిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ ఈ సీక్వెల్‌లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వీరితో పాటు రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా విడుదలైన జైలర్ 2 ట్రైలర్‌లో చూపించిన ఒక షాడో ఆధారంగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరవబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం నిజమైతే సినిమా పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులను తిరగరాయడం ఖాయం.

విడుదల ఎప్పుడు? రన్‌టైమ్ వివరాలు

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రం జైలర్ 2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు UA 16+ సర్టిఫికేట్‌ను కేటాయించింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. మొదటి భాగం సృష్టించిన రికార్డులను తిరగరాస్తూ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ సృష్టిస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More