Vishwanath And Sons: సూర్య ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టైటిల్ ఇదే.. ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?
Vishwanath And Sons: తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు మంచి ఫ్యామిలీ టచ్ ఉన్న పేరు పెట్టారు. అలాగే కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ పంచుకున్నారు. రిలీజ్ పైనా అప్డేట్ ఇచ్చారు.
వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో హిట్ కొట్టేందుకు తమిళ స్టార్ హీరో సూర్య రెడీ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా టైటిల్ ను ఇవాళ (మార్చి 2) మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా పంచుకున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్
సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ పేరును సోమవారం మేకర్స్ ప్రకటించారు. సినిమాకు పక్కా ఫ్యామిలీ టచ్ ఇచ్చేలా ఈ టైటిల్ ఉంది. ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆయనతో శక్తి
‘‘ఆయనతో ఉంటే శక్తి. ఆయన కౌగిలిలో వెచ్చదనం. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ స్పెక్టాకిల్ తో వింటేజ్ సూర్య మ్యాజిక్ తిరిగొస్తుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్యామిలీ డ్రామా అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ జులైలో రాబోతుంది’’ అని సోషల్ మీడియాలో సితారా ఎంటర్ టైన్మెంట్ ప్రకటించింది.
పోస్టర్ వైరల్
సూర్య46 సినిమా టైటిల్ ను విశ్వనాథ్ అండ్ సన్స్ గా ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. ఇందులో వింటేజీ లుక్ లో ఉన్న సూర్య ఓ బిడ్డను ఎత్తుకుని, చేతిలో పాలసీసాతో కనిపించాడు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇది తండ్రి, కొడుకుల మధ్య బంధాలతో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.
వరుస ఫ్లాప్ లు
సూర్యకు వరుస ఫ్లాప్ లు ఎదురవుతున్నాయి. బై భీమ్ మూవీ తర్వాత మరో సాలిడ్ హిట్ దొరకలేదు. ముఖ్యంగా కంగువా, రెట్రో సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిజల్ట్ మాత్రం షాకింగ్ గా వచ్చింది. ఈ నేపథ్యంలో రూట్ మార్చిన సూర్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంచుకున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ అంటూ థియేటర్లలోకి ఈ ఏడాది జులైలో రాబోతున్నాడు.
ఆ హిట్ తర్వాత
తెలుగు డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరి వరుసగా ఇతర భాషల హీరోలతో సినిమాలు తీస్తున్నాడు. ధనుష్ తో సార్ మూవీ తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా తీసి సంచలనం క్రియేట్ చేశాడు. ఇప్పుడు సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఓకేసారి తెలుగు, తమిళంలో రెడీ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


