Vishwanath and Sons Trailer: చంద్రముఖిలో జ్యోతికలా సూర్య.. రిచ్, స్టైలిష్‌గా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్

Vishwanath and Sons Trailer: సూర్య, మమితై బైజు లీడ్ రోల్స్ లో నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ తమిళ సినిమాలో తెలుగులోనూ ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.

Published on: Aug 7, 2026, 18:28:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vishwanath and Sons Trailer: "కరుప్పు" లాంటి బిగ్గెస్ట్ మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వర్సటైల్ తమిళ స్టార్ సూర్య, 'లక్కీ భాస్కర్' ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సందర్భంలో, మేకర్స్ వారం ముందే ఈ మైండ్ బ్లాకింగ్ ప్రమోషనల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Vishwanath and Sons Trailer: చంద్రముఖిలో జ్యోతికలా సూర్య.. రిచ్, స్టైలిష్‌గా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్
Vishwanath and Sons Trailer: చంద్రముఖిలో జ్యోతికలా సూర్య.. రిచ్, స్టైలిష్‌గా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్

20 ఏళ్ల ఏజ్ గ్యాప్ లవ్ ట్రాక్.. కథలో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్

ఈ సినిమాలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే ఇంటర్నేషనల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ పాత్రలో కనిపించబోతున్నారు. 40 ఏళ్ల వయసులో మళ్లీ స్పోర్ట్స్‌లోకి కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న సంజయ్ లైఫ్‌లోకి 'మ్యాడీ' అనే చలాకీ అమ్మాయిగా మమితా బైజు ఎంటర్ అవుతుంది.

సంజయ్ ముద్దుల కొడుకు బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతుండటంతో ఆ కుటుంబానికి డోనార్‌గా మమితా సాయపడుతుంది. ఆ సమయంలో సంజయ్‌కి దగ్గరైన మమితా.. ఆయనతో ప్రేమలో పడటంతో కథలో ఒక ఊహించని ఎమోషనల్ ట్విస్ట్ మొదలవుతుంది.

వారి మధ్య ఉన్న 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ వల్ల సంజయ్ ఆ ప్రేమని ఒప్పుకోలేక మానసికంగా రగిలిపోతుంటాడు. "నీ వయసుకు తగ్గ అబ్బాయిలు నీ చుట్టూ తిరుగుతారు" అని సూర్య చెప్పే డైలాగ్‌కి, "నేను ఎన్నిసార్లయినా చప్పట్లు కొడతాను, నువ్వే నాతో ప్రేమలో పడాలి" అని మమితా ఇచ్చే రిప్లై ట్రైలర్‌కే మెయిన్ హైలైట్‌గా నిలిచింది.

ఇక ట్రైలర్ చివర్లో తనకు నచ్చిన కార్లను సూర్య వరుసగా చూపిస్తూ ఎంతో మురిసిపోతుంటే.. ఇప్పుడు నువ్వెందుకు చంద్రముఖిలో జ్యోతికలా మారిపోతున్నావని మమితా అనే డైలాగ్ నవ్వులు పూయించింది.

వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్.. జీవీ ప్రకాష్ మ్యాజిక్

'తొలిప్రేమ', 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లు కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈసారి కూడా ఒక క్లాసీ అండ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. వయసులో చాలా తేడా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమను సమాజం చూసే విధానాన్ని ఎంతో మెచ్యూర్డ్‌గా, సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేశారు.

సూర్య తన వయసుకు తగ్గ సెటిల్డ్ రోల్‌లో ఎంతో హుందాగా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టారు. ఇక 'ప్రేమలు' సినిమాతో డిజిటల్ ఆడియన్స్‌ని ఫిదా చేసిన మమితా బైజు తన క్యూట్‌నెస్‌తో కథకి కావాల్సిన ఫ్రెష్‌నెస్‌ని తీసుకొచ్చింది.

రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, నాజర్, రాహుల్ బాబు లాంటి సీనియర్ నటుల సపోర్టింగ్ యాక్టింగ్ సినిమా రేంజ్‌ని మరింత పెంచేలా ఉంది. నిమిష్ రవి విజువల్స్, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చాలా రిచ్‌గా కుదిరాయి.

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మెలోడీ ట్యూన్స్ ట్రైలర్‌లో సీన్ల ఎమోషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. కోయంబత్తూరులో జరిగిన గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ, పెళ్లి తర్వాత కూడా పార్ట్‌నర్‌పై ప్రేమ నిరంతరం అలాగే ఉండాలని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమేనా?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అత్యంత రిచ్‌గా ఉన్నాయి.

ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే వరుసగా హాలిడేస్ అడ్వాంటేజ్‌తో థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూర్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More