నా తమ్ముడిది ఆత్మహత్య కాదు.. ఆ ఇద్దరూ కలిసి చంపారు.. చేతబడి చేశారు: సుశాంత్ సింగ్ అక్క కామెంట్స్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని ఆ ఇద్దరే చంపారంటూ అతని అక్క శ్వేతా సింగ్ కీర్తి ఆరోపించడం సంచలనం రేపుతోంది. అంతేకాదు చేతబడి కూడా జరిగిందని ఆమె అనడం గమనార్హం.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటికే అతని మరణంపై అనుమానాలు మాత్రం వీడటం లేదు. అతనిది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి చంపారని తనకు ఇద్దరు మానసిక నిపుణులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ అక్క శ్వేత సింగ్ చెప్పడం సంచలనం రేపుతోంది.

సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ లో చనిపోయాడు. అతనిది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ బ్యూరోలాంటి సెంట్రల్ ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగినా.. అతని మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చాయి. అయితే తాజాగా సుశాంత్ అక్క శ్వేతా చేసిన ఆరోపణలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అక్కడ బెడ్ కు, ఫ్యాన్ కు మధ్య ఉన్న దూరం చూస్తే అది స్పష్టంగా అర్థమవుతోందని చెప్పింది. అతని మెడపైనా ఉరేసుకున్నప్పుడు దుపట్టా గుర్తు కాకుండా ఓ చిన్న చెయిన్ గుర్తు కనిపించిందని తెలిపింది.
ఇద్దరు కలిసి చంపారు
సుశాంత్ చనిపోయిన తర్వాత తాను అమెరికాలో ఒకరు, ముంబైలో మరొకరు మానసిక నిపుణులను తాను సంప్రదించానని, వాళ్లు ఇది ఆత్మహత్య కాదు ఇద్దరు కలిసి హత్య చేశారని వాళ్లు చెప్పారని శ్వేత వెల్లడించింది. వాళ్లు ఒకరికొకరు ఎవరో తెలియకపోయినా.. ఇద్దరూ ఒకేలా చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని శ్వేత తెలిపింది. అతడు ఆత్మహత్య చేసుకోలేదు.. ఇద్దరు కలిసి హత్య చేశారు అని అమెరికా వ్యక్తి చెప్పగా.. ఇక్కడ ముంబైలోని వ్యక్తి కూడా అచ్చూ అలాగే చెప్పారని శ్వేత చెప్పింది.
చేతబడి చేశారని అన్నారు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కెరీర్లో చాలా వేగంగా ఎదగడం చూసి ఎవరో ఓర్వలేక చేతబడి చేయించినట్లు కూడా తమకు కాల్స్ వచ్చాయని శ్వేత తెలిపింది. 2020 మార్చి తర్వాత అతడు బతకడని తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని, అయితే బాగా చదువుకున్న కుటుంబం కావడంతో తాము వాటిని మొదట నమ్మలేదని ఆమె తెలిపింది. అయితే ఆ తర్వాత తనకు ప్రతిదీ సందేహం కలిగించేలా ఉండి ప్రశ్నించడం మొదలుపెట్టానని చెప్పింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించి కూడా శ్వేత మాట్లాడింది. ఆమె ఒక సందర్భంలో ఇన్‌స్టాలో ఒక కవిత షేర్ చేసిందని, దానిని సుశాంత్ కూడా లైక్ చేసినా తనకు వింతగా అనిపించిందని తెలిపింది. నువ్వు చాలా వేగంగా పైకి ఎగురుతున్నావ్.. నీ రెక్కలు కత్తిరించాల్సిందే అని ఆ కవిత ఉద్దేశంగా ఉందని, అది తనకు వింతగా అనిపించినట్లు శ్వేత చెప్పింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020, జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. 34 ఏళ్ల వయసులోనే అతడు ఇలా కన్నుమూయడం దేశాన్ని షాక్ కు గురి చేసింది. బాలీవుడ్ లో చాలా వేగంగా ఎదుగుతున్న అలాంటి నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే కోణంలో దర్యాప్తు జరిగినా అతని మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


