Taapsee Pannu: బాలీవుడ్ వర్సటైల్ నటి తాప్సీ పన్ను ఇండస్ట్రీలో తనకు ఎదురైన దారుణమైన అనుభవాలను బయటపెట్టి తీవ్ర కలకలం రేపింది. డేట్స్ కేటాయించి, ప్రాజెక్ట్‌కి కమిట్ అయిన తర్వాత కూడా తనను ఎలాంటి సరైన కారణం చెప్పకుండా సినిమా నుంచి తొలగించారని సంచలన నిజాలు వెల్లడించింది. రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మేకర్స్ తనను రీప్లేస్ చేయడానికి చెప్పిన వింతైన కారణాలను షేర్ చేసుకుంది.
'ఆ హీరో భార్యకి నువ్వంటే పడదంట!'.. తాప్సీ షాకింగ్ కామెంట్స్

పాపులర్ జర్నలిస్ట్ నయన్ దీప్ రక్షిత్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. సినిమాలో తనను వద్దని హీరోలే స్వయంగా తీయించేసేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది. "నన్ను సినిమా నుంచి ఎందుకు తీసేశారో నాకు సరైన క్లారిటీ కూడా ఇచ్చేవారు కాదు. హీరోకి నా మీద అభద్రతా భావం ఉండొచ్చు లేదా తనకు నచ్చిన, తనకు బాగా క్లోజ్‌గా ఉండే వేరే హీరోయిన్‌ని తీసుకోవాలనుకోవచ్చు. కానీ నాకు మాత్రం అసలు రీజన్ చెప్పకుండా దాచేసేవారు" అని తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక తనకు చెప్పిన అత్యంత చెత్త కారణం ఏంటో కూడా తాప్సీ బయటపెట్టింది. "ఒక సినిమా విషయంలో అయితే 'ఈ హీరో భార్యకి నువ్వంటే అస్సలు పడదు.. అందుకే నిన్ను తీసేస్తున్నాం' అని చెప్పారు. ఆ హీరో భార్యకి నాపై ఎందుకు అంత కోపమో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు" అని తాప్సీ బాంబ్ పేల్చింది. అయితే ఆ హీరో పేరు కానీ, ఆయన భార్య ఎవరనేది కానీ తాప్సీ బయటపెట్టలేదు.
ఒక్కసారే రిజెక్ట్ చేసేంత రేంజ్..
ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తాప్సీ.. ఒకే తరహా పాత్రలు చేసి బోర్ కొట్టించడం తన వల్ల కాదని తేల్చి చెప్పేసింది. 'తప్పడ్', 'హసీన్ దిల్‌రుబా', 'డంకీ' వంటి కంటెంట్ డ్రివెన్ సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడానికి గల కారణాలను కూడా వివరించింది.
"ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ సేఫ్ జోన్లో ఆడటానికి ట్రై చేస్తున్నారు. గ్లామరస్ రోల్స్ అనగానే ఒక ఐదుగురు హీరోయిన్లు, సీరియస్ ఎమోషనల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ రోల్స్ అనగానే మరో ఐదుగురు హీరోయిన్లు అని ఫిక్స్ అయిపోతున్నారు. అలా నన్ను ఒకే మార్క్ రోల్స్‌కే పరిమితం చేస్తుంటే వద్దని ముందే చెప్పేస్తున్నా" అని తాప్సీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, అలాంటి రొటీన్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ కి క్లైమాక్స్ ఈజీగా అర్థమైపోతుందని, తనను ఆ సినిమాల్లో వద్దని డైరెక్టర్లకే ఉచిత సలహా ఇచ్చి వచ్చేస్తున్నట్లు తెలిపింది.
'అస్సి' కోర్టురూమ్ డ్రామా నుంచి 'గాంధారి' ఇంటెన్స్ యాక్షన్ దాకా..
{{/usCountry}}"ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ సేఫ్ జోన్లో ఆడటానికి ట్రై చేస్తున్నారు. గ్లామరస్ రోల్స్ అనగానే ఒక ఐదుగురు హీరోయిన్లు, సీరియస్ ఎమోషనల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ రోల్స్ అనగానే మరో ఐదుగురు హీరోయిన్లు అని ఫిక్స్ అయిపోతున్నారు. అలా నన్ను ఒకే మార్క్ రోల్స్‌కే పరిమితం చేస్తుంటే వద్దని ముందే చెప్పేస్తున్నా" అని తాప్సీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, అలాంటి రొటీన్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ కి క్లైమాక్స్ ఈజీగా అర్థమైపోతుందని, తనను ఆ సినిమాల్లో వద్దని డైరెక్టర్లకే ఉచిత సలహా ఇచ్చి వచ్చేస్తున్నట్లు తెలిపింది.
'అస్సి' కోర్టురూమ్ డ్రామా నుంచి 'గాంధారి' ఇంటెన్స్ యాక్షన్ దాకా..
{{/usCountry}}తాప్సీ పన్ను కేవలం మాటలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన సినిమాలతో ఆడియెన్స్‌ను అలరిస్తోంది. రీసెంట్‌గా ప్రముఖ డైరెక్టరు అనుభవ్ సిన్హా తెరకెక్కించిన 'అస్సి' సినిమాలో లాయర్ రావి భట్కల్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. లైంగిక వేధింపుల కేసు ఆధారంగా సాగే ఈ ఇంటెన్స్ కోర్టురూమ్ డ్రామాలో తాప్సీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే టాక్ వచ్చింది.
దీంతో పాటు దేవాశిష్ మఖిజా డైరెక్షన్ లో వచ్చిన 'గాంధారి' మూవీలో తన కిడ్నాప్ అయిన కూతురి కోసం పోరాడే పవర్‌ఫుల్ మదర్ రోల్‌లో అదరగొట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో తాప్సీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ సీన్స్ ఓటీటీ ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దక్షిణాదిలో 'ఝుమ్మంది నాదం' మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ.. సొంత టాలెంట్‌తోనే బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌కి చేరుకుంటూ నేటితరం నటీమణులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది.