Tamannaah: బోల్డ్ హారర్ థ్రిల్లర్ మూవీలో తమన్నా.. అప్పుడు సన్నీ లియోనీ ఇప్పుడు మిల్కీ బ్యూటీ.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ..

Tamannaah: తమన్నా భాటియా సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ నెక్ట్స్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ఆమె తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పుడు రాగిణి 3 రాబోతోంది.

Published on: Jul 16, 2026, 09:49:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tamannaah: బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'రాగిణి' మళ్లీ థియేటర్లను భయపెట్టేందుకు రెడీ అయింది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ 'రాగిణి 3' షూటింగ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. సెట్స్ నుంచి డే 1 క్లాప్ బోర్డ్ పిక్ పంచుకుంటూ తమన్నా ఈ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

Tamannaah: బోల్డ్ హారర్ థ్రిల్లర్ మూవీలో తమన్నా.. అప్పుడు సన్నీ లియోనీ ఇప్పుడు మిల్కీ బ్యూటీ.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ..
Tamannaah: బోల్డ్ హారర్ థ్రిల్లర్ మూవీలో తమన్నా.. అప్పుడు సన్నీ లియోనీ ఇప్పుడు మిల్కీ బ్యూటీ.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ..

తమన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సంచలనం

బాహుబలి బ్యూటీ తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో "డే 01" అని రాసి ఉన్న క్లాప్ బోర్డ్ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. గతంలో డిఫరెంట్ రోల్స్ చేసిన తమన్నా.. ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ సూపర్‌ నేచురల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటించబోతోంది. ఈ పిక్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్‌గా మారింది.

తమన్నా గతంలో 'దేవి', 'ఆనందో బ్రహ్మ' లాంటి సినిమాలతో హారర్ కామెడీ జోనర్‌లో తన మార్క్ చూపించింది. రీసెంట్ గా 'స్త్రీ 2' సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటు 'ఓదెల 2' లాంటి ఇంటెన్స్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు 'రాగిణి 3' తో నేరుగా బాలీవుడ్ హారర్ స్పేస్‌ను రూల్ చేయడానికి వస్తోంది.

భారీ తారాగణ.. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఎంట్రీ

ఈ హారర్ ఎంటర్‌టైనర్‌లో కేవలం తమన్నా మాత్రమే కాకుండా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్టింగ్ ఉంది. సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'మహారాజ్' సినిమాతో ఓటీటీలో అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రశంసలు అందుకున్న జునైద్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. అలాగే 'అంతిమ్', 'రుస్లాన్' సినిమాలతో మాస్ యాక్షన్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయుష్ శర్మ ఈ హారర్ థ్రిల్లర్‌లో ఎలాంటి రోల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

'రాగిణి' ఫ్రాంచైజ్ హిస్టరీ.. క్లాసిక్ బోల్డ్ హారర్

బాలీవుడ్‌లో హారర్ విత్ సస్పెన్స్ కాంబినేషన్‌కు ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన ప్రాజెక్ట్ 'రాగిణి ఎమ్ఎమ్ఎస్'. 2011లో రాజ్‌కుమార్ రావ్, కైనాజ్ మోతీవాలాతో వచ్చిన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది. రాత్రి పూట కాటేజ్‌లో జరిగే భయానక సంఘటనల ఆధారంగా ఆ సినిమా ఆడియన్స్ మనస్సుల్లో గూడుకట్టుకుంది.

ఆ తర్వాత 2014లో సన్నీ లియోన్ నటన, 'బేబీ డాల్' సాంగ్ మానియాతో వచ్చిన 'రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2' ఏకంగా ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత డిజిటల్ స్పేస్ లో 'రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్' వెబ్ సిరీస్ కూడా ఓటీటీ ఆడియన్స్ ను బాగా అలరించింది. ఇప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మూడో పార్ట్ 'రాగిణి 3' పేరుతో నేరుగా బిగ్ స్క్రీన్ పైకి రాబోతోంది.

కొత్త డైరెక్టర్.. టాప్ లెవెల్ టెక్నీషియన్స్

గతంలో వచ్చిన పార్ట్స్ కంటే డిఫరెంట్‌గా ఈసారి 'రాగిణి 3' సినిమాను ప్రసిద్ధ డైరెక్టర్ శశాంక ఘోష్ హ్యాండిల్ చేస్తున్నారు. 'వీరే ది వెడ్డింగ్', 'ఫ్రెడ్డీ', 'ప్లాన్ ఎ ప్లాన్ బి' లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన శశాంక.. ఈ హారర్ థ్రిల్లర్‌ను సరికొత్త సస్పెన్స్ కథనంతో డిజైన్ చేస్తున్నారు.

బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అమర్ బుతాలా, కుమార్ తౌరానీ, గిరీష్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ చేతులు కలపడంతో ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి.

కెమెరా మ్యాజిక్.. రాబోయే అప్‌డేట్స్

ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి యక్కంటి డిఓపిగా వర్క్ చేస్తున్నారు. మరాఠీ బ్లాక్‌బస్టర్ 'సైరాట్', హిందీ జాతీయ అవార్డు పొందిన సినిమాలకు కెమెరా వర్క్ చేసిన సుధాకర్, ఈ హారర్ థ్రిల్లర్‌లో విజువల్స్‌ను చాలా గ్రాండ్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారు.

ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ అప్‌డేట్స్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. తమన్నా లీడ్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాను సౌత్ భాషల్లో కూడా డబ్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More