Tamannaah Bhatia: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆ చూపుల్లో గౌరవం ఉండదు.. బాలీవుడ్‌తో పోలుస్తూ తమన్నా సంచలన వ్యాఖ్యలు!

Tamannaah Bhatia: దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమల్లో మహిళల పట్ల ఉండే దృక్పథం, వివక్షపై స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా సౌత్ సినిమాల్లో ఉండే పితృస్వామ్య ధోరణి, 'ఐటమ్ సాంగ్' అనే పదంపై ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కింది.

Published on: Jun 24, 2026, 13:48:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tamannaah Bhatia: చిత్ర పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం, వారిని చూసే విధానం, ఎదుర్కొంటున్న సవాళ్లపై స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సౌత్ సినిమా ఇండస్ట్రీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు (x/tamannaahspeaks)
సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు (x/tamannaahspeaks)

తేడాలు చెప్పిన తమన్నా

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దశాబ్ద కాలానికి పైగా టాప్ హీరోయిన్ గా రాణించిన తమన్నా తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేసింది. బాలీవుడ్‌కు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య మహిళల ప్రాధాన్యత విషయంలో ఉన్న స్పష్టమైన వ్యత్యాసాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌లో వైవిధ్యం

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విభిన్న రకాల మహిళా కళాకారులకు తగిన గుర్తింపు, స్పేస్ లభిస్తాయని తమన్నా అభిప్రాయపడింది. ‘‘బాలీవుడ్ లో కొందరు నటీమణులు కేవలం నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలకే పరిమితమై తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మరికొందరు కమర్షియల్ గ్లామర్‌ను, బలమైన నటనను సమతూకంలో తీసుకెళ్తూ కెరీర్‌ను విజయవంతంగా మలచుకుంటున్నారు’’ అని తమన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఆ చూపు ఇబ్బందికరం

దక్షిణాది సినీ పరిశ్రమలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని తమన్నా ఓపెన్ గానే చెప్పింది. సౌత్ చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ పితృస్వామ్య వాతావరణం ఎక్కువగా కనిపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

"సౌత్ ఇండస్ట్రీలో మహిళలు కొన్నిసార్లు ఇబ్బందికరమైన చూపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ చూపుల్లో ఎల్లప్పుడూ గౌరవం కనిపించదు" అని తమన్నా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ రకమైన వాతావరణం మహిళా కళాకారులకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

'ఐటమ్ సాంగ్' అనే పదంపై

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ను వర్ణించడానికి ఉపయోగించే 'ఐటమ్ సాంగ్' అనే పదంపై తమన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు ఈ లేబుల్ అస్సలు నచ్చదని ఆమె స్పష్టం చేసింది.

"ఇలాంటి పదాలు డ్యాన్స్ చేసే హీరోయిన్లను కేవలం ఒక వస్తువులా (ఆబ్జెక్ట్) చిత్రీకరిస్తాయి. ఒక కళాకారిణిగా ఆ పాట కోసం వారు పడే శ్రమను, వారి ప్రతిభను ఈ పదం పూర్తిగా కించపరుస్తుంది" అని తమన్నా తెలిపింది.

అలాగే చూడాలి

తాను సినిమాల్లో ప్రత్యేక గీతాలను ఎంచుకునేటప్పుడు ఎప్పుడూ సొంత నిబంధనలకే ప్రాధాన్యమిచ్చానని తమన్నా వెల్లడించింది. మహిళలను తక్కువ చేసి చూపే ఇలాంటి లేబుల్స్‌ పక్కన పెట్టి, కేవలం ప్రేక్షకులను అలరించే ఒక వినోదాత్మక ప్రదర్శనగా మాత్రమే ఆ పాటలను చూడాలని ఆమె కోరింది.

తమన్నాపై ట్రోల్స్

సౌత్ ఇండస్ట్రీపై తమన్నా చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. తెలుగు, తమిళం సినిమాలతోనే తమన్నా స్టార్ డమ్ సంపాదించుకుంది. హీరోయిన్ గా కెరీర్ సెట్ చేసుకుంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లానని సౌత్ ఇండస్ట్రీని తక్కువు చేస్తుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడం లాగే ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More