Actress Anandhi: నా సీన్లన్నీ కట్ చేశారు.. నా కల నాశనం చేశారు: విజయ్ జన నాయగన్ మూవీ చూసి ఏడ్చిన నటి.. వీడియో వైరల్
Actress Anandhi: దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీలో తన సీన్స్ తొలగించడంపై నటి ఆనంది ఏడుస్తూ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరాశ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Actress Anandhi: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Vijay) ఫేర్‌వెల్ మూవీ 'జన నాయగన్' చూశాక థియేటర్లోనే హీరోయిన్ 'కాయల్' ఆనంది కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో తను నటించిన సీన్స్ అన్నింటినీ ఫైనల్ కట్‌లో పూర్తిగా ఎడిట్ చేసి తీసేయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.

బిగ్ స్క్రీన్ మీద తను నటించిన సీన్స్ చూసుకుందామని ఎంతో ఆశగా థియేటర్‌కు వెళ్లిన ఆనందికి ఫైనల్ వర్షన్‌లో ఒక్క సీన్ కూడా కనిపించకపోవడంతో షాక్‌కు గురైంది. ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ తన బాధను బహిరంగంగా వ్యక్తం చేసింది.
"విజయ్ సర్ పక్కన నటించడమే నా డ్రీమ్.. కానీ దురదృష్టం!"
ఆనంది తన వీడియోలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది. "నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి దళపతి విజయ్ సర్ పక్కన ఒక్క సీన్‌లోనైనా నటించాలనేది నా పెద్ద కల. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర కాలంగా వెయిట్ చేస్తున్నా" అంటూ ఆవేదన చెందింది.
సాధారణంగా సినిమాల్లో కొన్ని సీన్స్ కట్ అవ్వడం కామన్ అని, అయితే విజయ్ గారికి ఇది చివరి సినిమా కావడం వల్లే తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. విజయ్ గారు సినిమాలు కొనసాగిస్తే మళ్లీ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు.. కానీ ఇదే ఆయన లాస్ట్ మూవీ అవ్వడం వల్ల తనకు ఆ ఛాన్స్ మళ్లీ రాదని ఎంతో బాధపడింది.
డైరెక్టర్ వినోద్ ఎందుకు కట్ చేశారు?
హెచ్. వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమాలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉందంటూ ఆనంది సినిమాపై ప్రశంసలు కురిపించింది. అయినప్పటికీ విజయ్‌తో తాను చేసిన ముఖ్యమైన సీన్స్ ఎడిటింగ్ సూట్‌లో కట్ కావడం తన దురదృష్టమని భావిస్తున్నట్లు కన్నీళ్లతో తెలిపింది.
రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్-ఇండియా సినిమాలో రన్ టైమ్ బ్యాలెన్స్ చేయడం కోసమే ఎడిటర్స్ కొన్ని క్యారెక్టర్ సీన్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒక నటిగా ఏడాదిన్నర పాటు పడ్డ కష్టం బిగ్ స్క్రీన్ మీద కనిపించకపోవడం నిజంగా బాధాకరమని సోషల్ మీడియాలో మూవీ లవర్స్ ఆనందికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ, ఫ్యాన్స్ ఎమోషన్
తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ పెట్టి పూర్తిస్థాయి రాజకీయాలోకి అడుగుపెట్టిన దళపతి విజయ్‌కి ఇది నటుడిగా చివరి సినిమా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్ చుట్టూ విపరీతమైన హైప్ నెలకొంది. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ, ఆనంది లాంటి టాలెంటెడ్ నటికి జరిగిన ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగులో 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' లాంటి హిట్స్ తర్వాత తమిళంలో 'కాయల్', 'పరియేరుమ్ పెరుమాళ్' లాంటి పవర్‌ఫుల్ సినిమాలతో మెప్పించిన ఆనందికి ఈ చేదు అనుభవం ఎదురవ్వడంపై ఫ్యాన్స్ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


