OTT Tamil: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న తమిళ సెటైరికల్ కామెడీ మూవీ.. పొంగల్ రేసులో సైలెంట్ హిట్టు కొట్టిన సినిమా
ఓటీటీలోకి ఇప్పుడో తమిళ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. సంక్రాంతి బరిలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి హిట్ కొట్టిన మూవీ ఇది. జీవా నటించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది.
విజయ్, శివకార్తికేయన్ వంటి బడా స్టార్ల సినిమాల మధ్య పోటీలో నిలిచి, పొంగల్ 2026లో సర్ప్రైజ్ హిట్‌గా నిలిచిన జీవా సినిమా 'తలైవర్ తంబి తలైమైయిల్'. నితిష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 12న తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి జీవా మూవీ
ఈ ఏడాది పొంగల్ బాక్సాఫీస్ రేసు చాలా ఆసక్తికరంగా సాగింది. విజయ్ 'జన నాయగన్' సెన్సార్ చిక్కుల్లో పడటం, శివకార్తికేయన్ 'పరాశక్తి' అంచనాలు అందుకోలేకపోవడంతో.. జీవా నటించిన 'తలైవర్ తంబి తలైమైయిల్' (Thalaivar Thambi Thalaimaiyil) ఊహించని విజయాన్ని సాధించింది. మలయాళ దర్శకుడు నితిష్ సహదేవ్ (Falimy మూవీ ఫేమ్) తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది.
థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. అయితే హిందీ వెర్షన్ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ లేదు.
కార్తి సినిమా కంటే బెటర్ రన్..
సంక్రాంతికి విడుదలైన కార్తి సినిమా 'వా వాథియార్' (Vaa Vaathiyaar) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో అది విడుదలైన రెండు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. తెలుగులోనూ అన్నగారు వస్తున్నారు పేరుతో నేరుగా ఓటీటీలోకే వచ్చింది. కానీ జీవా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని, దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.
ఇదొక విలేజ్ కామెడీ డ్రామా. ఇందులో జీవా 'జీవరత్నం' అనే పంచాయతీ లీడర్‌గా కనిపిస్తాడు. ఊర్లో ఒక పెళ్లి జరిపించే బాధ్యతను అతడు తీసుకుంటాడు. అయితే సరిగ్గా పెళ్లి రోజే పక్కింట్లో ఒకరు చనిపోతారు. ఒకవైపు పెళ్లి సందడి, మరోవైపు చావు విషాదం.. ఈ రెండింటి మధ్య జరిగే గందరగోళం, కామెడీనే ఈ సినిమా కథ. ఇందులో తంబి రామయ్య, ఇలవరసు, ప్రార్థన నాథన్ కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


