మెగాస్టార్ బాక్సాఫీస్ విధ్వంసం.. మన శంకర వరప్రసాద్ గారు లాభాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే! ఓటీటీలోకి సంక్రాంతి హిట్
మన శంకర వరప్రసాద్ గారు అంటూ బాక్పాఫీస్ ను షేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా ఆల్ టైమ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతున్న నేపథ్యంలో బడ్జెట్, కలెక్షన్లు, లాభాలపై ఓ లుక్కేయండి.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. రాజకీయాల్లోకి వెళ్లి, తిరిగొచ్చిన తర్వాత చిరు సినిమాలు చేశారు కానీ సాలిడ్ హిట్ గా నిలిచింది మాత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమానే. ఈ మూవీతో మెగాస్టార్ రికార్డులు బ్రేక్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్, కలెక్షన్లు, లాభాలపై డిస్కషన్ కొనసాగుతోంది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ
చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. దీనికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. బుధవారం (ఫిబ్రవరి 11) నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
సంక్రాంతి బ్లాక్ బస్టర్
సంక్రాంతి 2026 సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు థియేటర్లలోకి వచ్చింది. జనవరి 12న ఈ మూవీ రిలీజైంది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వేటలో ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ దూసుకెళ్లింది. వారానికే లాభాల్లోకి వచ్చేసింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రీజినల్ హిట్ గా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు సినిమా.
మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్
మన శంకర వరప్రసాద్ గారు సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ మూవీకి ప్రమోషన్లు కూడా కలుపుకొని సుమారు రూ.120 కోట్లు ఖర్చయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కానీ థియేటర్లలో మన శంకర వరప్రసాద్ గారు పెట్టిన బడ్జెట్ కు మూడు రెట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు
చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.380 కోట్ల గ్రాస్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు సాధించింది. కేవలం యుఎస్ మార్కెట్లోనే ఈ సినిమా 4.8 మిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది.
మన శంకర వరప్రసాద్ గారు లాభాలు
మన శంకర వరప్రసాద్ గారు సినిమా అదిరే లాభాలు సాధించింది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.120 కోట్లు. బాక్సాఫీస్ దగ్గర గ్రాస్ కలెక్షన్లు ఏమో రూ.380 కోట్లు. ఇక రిలీజ్ కు ముందే ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.150 కోట్లుకు పైగానే మన శంకర వరప్రసాద్ గారు మూవీ బిజినెస్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే అన్ని ఖర్చులు పోను ప్రొడ్యూసర్లకు రూ.200 కోట్ల వరకు మన శంకర వరప్రసాద్ గారు మూవీ లాభాలు తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












