Web Series: తమిళ డిజిటల్ స్పేస్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఇంటెన్స్ కోర్టురూమ్ డ్రామా 'చట్టముమ్ నీదియుమ్' (Sattamum Needhiyum) రెండో సీజన్ ఓటీటీ రిలీజ్‌కు అఫీషియల్‌గా డేట్ లాక్ చేసుకుంది. 'పరుత్తివీరన్' ఫేమ్ సీనియర్ నటుడు శరవణన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ లీగల్ ఎమోషనల్ వెబ్ సిరీస్ అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ చూడొచ్చు. మరి దీని కంటే ముందు మొదటి సీజన్ లో ఏం జరిగిందో ఒకసారి చూడండి.
కోర్టు ఆవరణలో తండ్రి ఆత్మాహుతి.. కదిలించే కథనం

ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ ఆరంభమే తీవ్రమైన భావోద్వేగాలతో సాగుతుంది. కుప్పుసామి (షణ్ముగం) అనే ఒక నిరుపేద తండ్రి, కిడ్నాప్ అయిన తన కూతురు వెన్నెల ఆచూకీ కోసం పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతాడు. అయితే అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడంతో, తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తండ్రి కోర్టు ప్రాంగణంలోనే అందరూ చూస్తుండగా ఆత్మాహుతి చేసుకుంటాడు.
ఈ భయానక సంఘటన సమాజంలో పెద్ద అలజడి సృష్టిస్తుంది. అప్పుల్లో కూరుకుపోయి లాయర్ వృత్తికి దూరంగా ఉంటున్న సుందరమూర్తి (పరుత్తివీరన్ శరవణన్) మనసును ఈ ఉదంతం తీవ్రంగా చలింపజేస్తుంది. దాంతో ఆ నిరుపేద తండ్రికి ఎలాగైనా న్యాయం చేయాలని గట్టి పట్టుదలతో లీగల్ కంబ్యాక్ ఇస్తాడు.
జూనియర్ లాయర్‌తో చేతులు కలిపి సంచలన పోరాటం
లాయర్ సుందరమూర్తి సమాజంలో మార్పు కోరుకునే యంగ్ జూనియర్ లాయర్ అరుణ (నమ్రిత ఎమ్‌వి)తో చేతులు కలుపుతాడు. ఇద్దరూ కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) తో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేస్తారు.
రాజకీయంగా, పోలీస్ వ్యవస్థలో ఉన్న అవినీతిని బయటపెట్టడానికి ఈ ఇద్దరూ తెగించి పోరాడతారు. పవర్ ఫుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (అరుల్ డి శంకర్) వేసే కుట్రలకు పైఎత్తులు వేస్తూ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లారనేది కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
'పరుత్తివీరన్' శరవణన్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్
సౌత్ ఆడియన్స్‌కు బాగా పరిచయమున్న సీనియర్ నటుడు శరవణన్ లాయర్ సుందరమూర్తి క్యారెక్టర్లో అద్భుతంగా ఒదిగిపోయారు. జీవితంలో ఓడిపోయి మళ్లీ ఆత్మవిశ్వాసంతో పోరాడే లాయర్‌గా ఆయన పండించిన ఎమోషన్స్, కోర్టురూమ్ డైలాగ్ డెలివరీ సిరీస్‌కి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.
{{/usCountry}}సౌత్ ఆడియన్స్‌కు బాగా పరిచయమున్న సీనియర్ నటుడు శరవణన్ లాయర్ సుందరమూర్తి క్యారెక్టర్లో అద్భుతంగా ఒదిగిపోయారు. జీవితంలో ఓడిపోయి మళ్లీ ఆత్మవిశ్వాసంతో పోరాడే లాయర్‌గా ఆయన పండించిన ఎమోషన్స్, కోర్టురూమ్ డైలాగ్ డెలివరీ సిరీస్‌కి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.
{{/usCountry}}సిరీస్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్లు, క్యారెక్టర్ల సైకలాజికల్ లోతును చాలా సహజంగా ఎలివేట్ చేశాయి. మొదటి సీజన్‌తో కోర్టురూమ్ డ్రామా ప్రేమికులను ఆకట్టుకున్న ఈ టీమ్, ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత ఇంటెన్స్ కంటెంట్‌ను అందించబోతోంది.
లీగల్, ఎమోషనల్ థ్రిల్లర్ లవర్స్ కోసం..
వ్యవస్థలోని లోపాలను, ఒక సామాన్యుడి హక్కుల కోసం సాగే పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సిరీస్ డిజిటల్ స్పేస్‌లో కచ్చితంగా మంచి వ్యూయర్‌షిప్ దక్కించుకునే అవకాశం ఉంది.
ఎమోషనల్, కోర్టురూమ్ డ్రామా సినిమాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే ఓటీటీ లవర్స్ అక్టోబర్ 23 నుంచి జీ5 ప్లాట్‌ఫామ్‌లో ఈ క్రేజీ తమిళ వెబ్ సిరీస్‌ను హ్యాపీగా డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.