ఓటీటీలోకి తెలుగులో అందుబాటులోకి వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.4 రేటింగ్

ఓటీటీలోకి ఓ తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగు ఆడియోలోకి తీసుకొచ్చినట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ఐఎండీబీలో 8.4 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది.

Published on: Jan 26, 2026, 14:48:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సూపర్ బ్లాక్‌బస్టర్ మూవీ సిరాయ్ (Sirai). ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి రావడం విశేషం.

ఓటీటీలోకి తెలుగులో అందుబాటులోకి వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.4 రేటింగ్
ఓటీటీలోకి తెలుగులో అందుబాటులోకి వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.4 రేటింగ్

సిరాయ్ తెలుగు స్ట్రీమింగ్

విక్రమ్ ప్రభు లీడ్ రోల్లో నటించిన సినిమా ఈ సిరాయ్. అంటే తెలుగులో జైలు అని అర్థం. దీనిని సోమవారం (జనవరి 26) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

“తమిళనాడును షాక్‌కు గురి చేసిన సినిమా. ఇప్పుడు తెలుగులో.. సిరాయ్ జీ5లో.. 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమాను కేవలం తమిళంలోనే ఓటీటీలోకి తీసుకొచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు తెలుగులోనూ రావడంతో మూవీని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

సిరాయ్ మూవీ గురించి..

సిరాయ్ ఓ తమిళ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా. దీనిని సురేష్ రాజకుమారి డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి మూవీ కావడం గమనార్హం. ఇందులో విక్రమ్ ప్రభుతోపాటు ఎల్కే అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్ కుమార్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.31 కోట్లు వసూలు చేసింది. అన్ని వర్గాల నుంచి సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఐఎండీబీలనూ 8.4 రేటింగ్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఓ విచారణలో ఉన్న ఖైదీ, అతనికి కాపలాగా ఉండే ఓ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఖైదీని వెల్లూరు జైలు నుంచి శివగంగై కోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓ హత్య కేసులో నిందితుడితో ఆ కానిస్టేబుల్ చేసిన ఆ ప్రయాణం అతని జీవితాన్ని ఎలా మార్చేసిందన్నదే ఈ సిరాయ్ మూవీ కథ. ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మరింత ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More