OTT Tamil: రెజ్లర్‌గా ఐశ్వర్య లక్ష్మీ.. హౌస్ హజ్బెండ్‌గా విష్ణు విశాల్.. ఓటీటీలోకి తెలుగులోనూ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ
OTT Tamil: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్ వస్తోంది. నెల రోజుల్లోపే వస్తున్న ఈ సినిమా థియేటర్లలో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐశ్వర్య లక్ష్మి రెజ్లర్ గా, విష్ణు విశాల్ హౌస్ హజ్బెండ్ గా నటించారు.
OTT Tamil: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, బోల్డ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన రూ. 55 కోట్ల బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'గట్ట కుస్తీ 2' (Gatta Kusthi 2) డిజిటల్ ప్రిమియర్‌కి డేట్ లాక్ అయింది. థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించడంతో సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

విష్ణు విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్.. రూ. 55 కోట్ల వసూళ్లు
ఈ సినిమా జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. కేవలం మూడు వారాల్లోనే గ్లోబల్ వైడ్‌గా రూ. 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విష్ణు విశాల్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.
తను నిర్మించిన చిత్రాల్లో తొలిసారి రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరడంతో విష్ణు విశాల్ గ్రాండ్ లెవెల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోని బి, సి సెంటర్లలో ఈ సినిమాకి ఊహించని రీతిలో భారీ ఆదరణ లభించింది.
హౌస్ హస్బెండ్‌గా విష్ణు విశాల్.. రెజ్లర్‌గా ఐశ్వర్య లక్ష్మి!
2022లో వచ్చి సూపర్ హిట్ అయిన 'గట్ట కుస్తీ' మొదటి భాగానికి సీక్వెల్‌గా డైరెక్టర్ చెల్లా అయ్యావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ పార్ట్ 2 కథలో వీర (విష్ణు విశాల్) తన భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) రెజ్లింగ్ డ్రీమ్స్‌కి సపోర్ట్ చేస్తూ ఇంట్లోనే హౌస్ హస్బెండ్‌గా బాధ్యతలు తీసుకుంటాడు.
అయితే తమ కూతురు మతి మలర్ (జారా జియాన్నా) పెంపకం విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో గొడవలు మొదలవుతాయి. కూతురి భవిష్యత్తు కోసం కీర్తి తన రెజ్లింగ్ కెరీర్‌ను త్యాగం చేసే పరిస్థితి వస్తుంది. విడాకుల వరకు వెళ్లిన ఈ భార్యాభర్తల బంధం చివరకు ఎలాంటి మలుపు తిరిగింది? కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి వీరు ఏం చేశారనేది సినిమాలో నవ్వులు పూయించేలా చూపించారు.
రమ్య కృష్ణన్, యోగి బాబు ఎంట్రీ..
ఈ సీక్వెల్‌లో వర్సటైల్ యాక్ట్రెస్ రమ్య కృష్ణన్, స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రత్యేక పాత్రల్లో నటించి సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాళీ వెంకట్, కరుణాస్, మునీష్‌కాంత్, లిజీ ఆంటోనీ, గజరాజ్, శ్రీజ రవి తమ నటనతో కడుపుబ్బ నవ్వించారు.
స్క్రీన్ ప్లేలో సుదీర్ఘమైన కామెడీ సీన్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మెసేజ్, ఫెమినిజం ఎలిమెంట్స్‌ను పక్కా కామెడీతో బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ చెల్లా అయ్యావు ఈ సినిమాను మలచిన తీరుకి క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. సినిమా సాధించిన బిగ్గెస్ట్ సక్సెస్‌కి సంతోషించిన హీరో అండ్ ప్రొడ్యూసర్ విష్ణు విశాల్ డైరెక్టర్ చెల్లా అయ్యావుకి ఒక ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.
నెట్‌ఫ్లిక్స్‌లో జులై 31 నుంచి స్ట్రీమింగ్
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత ఇషారి K గణేష్‌తో కలిసి విష్ణు విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో మిస్ అయిన మూవీ లవర్స్, ఈ పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


