OTT: కేంద్ర మంత్రికి కిడ్నీ దానం.. చనిపోయాడనుకున్న వ్యక్తే దాత.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ పొలిటికల్ సెటైర్ మూవీ
OTT: ఓటీటీలో ఓ ఇంట్రెస్టింగ్ తమిళ పొలిటికల్ సెటైర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పేరు మై లార్డ్. శశికుమార్, చైత్ర నటించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
తమిళ టాలెంటెడ్ యాక్టర్ శశికుమార్, కన్నడ బ్యూటీ చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్స్‌గా నటించిన లేటెస్ట్ తమిళ సోషల్ డ్రామా మై లార్డ్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఓ గుడ్ న్యూస్. ఈ సినిమా ఫైనల్‌గా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మై లార్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
మై లార్డ్ మూవీ ఈ ఏడాదిలో వచ్చిన ఒక ఇంటెన్స్ తమిళ క్రైమ్ సోషల్ డ్రామా. యాక్టర్ కమ్ డైరెక్టర్ శశికుమార్ ఇందులో హీరోగా చేయగా, చైత్ర జె ఆచార్ హీరోయిన్‌గా నటించింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం తమిళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసేయొచ్చు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఐదు వారాల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది.
గుండెల్ని పిండేసే మై లార్డ్ స్టోరీ ఇదే..
అసలు ఈ మై లార్డ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇది సమాజంలో ఎప్పుడూ అణచివేతకు, దోపిడీకి గురయ్యే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. కొన్ని ఊహించని సంఘటనల తర్వాత వాళ్లకు తెలియకుండానే వాళ్ల శరీరంలోని అవయవాలను కొందరు దొంగిలించారని ఆ జంటకు తెలుస్తుంది. అంతేకాదు అసలు వాళ్లు చనిపోయారని కూడా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక హై ప్రొఫైల్ కేంద్ర మంత్రి కోసం తమ కిడ్నీ డొనేట్ చేయాలని ఇంకొందరు వాళ్లను బాగా బలవంతపెడుతుంటారు.
ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఒక పవర్‌ఫుల్ స్టోరీ. ఒక చిన్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాయంతో ఆ జంట తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు, తమ ఉనికి కోసం ఏం చేశారు అనేది ఈ సినిమా ప్రధాన స్టోరీ. పవర్, ఐడెంటిటీ లాంటి సీరియస్ థీమ్స్‌ను ఇందులో చాలా లోతుగా చూపించారు.
మై లార్డ్ నటీనటులు, ఇతర వివరాలు
శశికుమార్, చైత్ర జె ఆచార్‌తో పాటు ఈ మై లార్డ్ సినిమాలో గురు సోమసుందరం, జయప్రకాష్, ఆశా శరత్, గోపి నైనార్, వసుమిత్ర లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు స్టోరీ రాసి డైరెక్ట్ చేయగా, సీన్ రోల్డన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
స్టార్ హీరో సూర్య తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం మరో విశేషం. రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి, బాక్సాఫీస్ దగ్గర కూడా ఒక డీసెంట్ వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ డ్రామా 3BHK మూవీ తర్వాత చైత్రకు కోలీవుడ్‌లో ఇది రెండో తమిళ సినిమా.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


