OTT Tamil: కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమోషనల్ అండ్ మ్యూజికల్ డ్రామా 'చారుకేశి' (Charukesi) తెలుగు వెర్షన్ ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. బాషా, అరుణాచలం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు సురేష్ కృష్ణ (Suresh Krissna) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఆడియన్స్‌కు అందుబాటులోకి వచ్చింది.

సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ (YG Mahendran) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన అలనాటి స్టార్ హీరోయిన్ సుహాసిని (Suhasini) కథానాయికగా కనిపించారు.
జ్ఞాపకాలు చెరిగిపోతున్న వేళ సవాల్‌గా మారిన జీవితం
ఈ సినిమా కథ మొత్తం కర్ణాటక సంగీత విద్వాంసుడు చారుకేశి (వైజీ మహేంద్రన్) జీవితం చుట్టూ తిరుగుతుంది. ఎంతోమందికి సాయం చేస్తూ, సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చారుకేశికి ఊహించని విధంగా అల్జీమర్స్ (Alzheimer's) వ్యాధి సోకుతుంది. రోజురోజుకూ తన పాత జ్ఞాపకాలను మర్చిపోతున్న తరుణంలో ఒక యువతి అతని జీవితంలోకి వచ్చి ఒక రహస్యంతో బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది.
మరోవైపు సొంత కొడుకే అతనిపై పగ పెంచుకోవడం, వ్యాధి వల్ల తలెత్తే ఇబ్బందులు చారుకేశిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తాయి. నాణేనికి బొమ్మ, బొరుసు రెండూ ఉంటాయనే సూత్రాన్ని నమ్మే చారుకేశి, తన జీవితంలో ఎదురైన ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? తన సంగీత వారసత్వాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన కథ.
సీనియర్ నటీనటుల అద్భుత నటన..
ఈ సినిమాలో చారుకేశి పాత్రలో వైజీ మహేంద్రన్ అద్భుతంగా జీవించారు. ఒక సంగీత విద్వాంసుడిగా, అల్జీమర్స్ వల్ల బాధపడే వ్యక్తిగా ఆయన పండించిన హావభావాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఆయన భార్య భాగ్యం పాత్రలో సుహాసిని, స్నేహితుడిగా తలైవాసల్ విజయ్ తమ అనుభవంతో సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. దేవా అందించిన సంగీతం, శంకర్ మహదేవన్ వోకల్స్ సినిమాకు క్లాసిక్ ఫీల్ తెచ్చాయి.
అయితే కొన్ని సీరియల్ తరహా సెంటిమెంట్ సీన్లు, అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు సినిమా వేగాన్ని కాస్త మందగించేలా చేస్తాయి. అయినప్పటికీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ మూవీస్ చూడాలనుకునే ఓటీటీ ప్రియులకు 'చారుకేశి' ప్రైమ్ వీడియోలో ఒక మంచి బింజ్ వాచ్ ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని అందులోనూ కర్నాటిక్ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.
{{/usCountry}}అయితే కొన్ని సీరియల్ తరహా సెంటిమెంట్ సీన్లు, అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు సినిమా వేగాన్ని కాస్త మందగించేలా చేస్తాయి. అయినప్పటికీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ మూవీస్ చూడాలనుకునే ఓటీటీ ప్రియులకు 'చారుకేశి' ప్రైమ్ వీడియోలో ఒక మంచి బింజ్ వాచ్ ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని అందులోనూ కర్నాటిక్ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.
{{/usCountry}}