ఓటీటీలోకి తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్.. దేవతను కాపాడుకునే జనం

ఓటీటీలో ఓ ఇంట్రెస్టింగ్ తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీకి ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉండటం విశేషం. గతేడాది డిసెంబర్ 12న రిలీజైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Jan 11, 2026, 06:22:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళంలో మైథలాజికల్ థ్రిల్లర్ తరచూ వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో ఉన్నాయి. వాటిలోకి తాజాగా మహాసేన (Mahasenha) అనే మరో సినిమా వచ్చి చేరుతోంది. ఈ మూవీ ఏంటి? ఐఎండీబీలో దీనికి 9.2 రేటింగ్ రావడానికి కారణమేంటో చూడండి.

ఓటీటీలోకి తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్.. దేవతను కాపాడుకునే జనం
ఓటీటీలోకి తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్.. దేవతను కాపాడుకునే జనం

మహాసేన ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ థ్రిల్లర్ కు కాస్త మైథాలజీని జోడించి వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. కాంతార కూడా అలా వచ్చే పెద్ద విజయం సాధించింది. తమిళంలోనే మహాసేన పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ సినిమా మంగళవారం (జనవరి 13) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

“సస్పెన్స్ తో కూడిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మహాసేన.. జనవరి 13న కేవలం ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. రెండు భాగాలుగా ఈ మూవీ రానుండగా.. మొదటి భాగం ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

మహాసేన మూవీ విశేషాలు

మహాసేన (Mahasenha) మూవీ గతేడాది డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. విమల్ లీడ్ రోల్లో నటించాడు. దినేష్ కలైసెల్వన్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇదో లో బడ్జెట్ మూవీ. అడవిలో ఉండే చిన్న ఊరు. అక్కడ తన కూతురు, తన ఏనుగును ప్రాణంగా చూసుకుంటూ ఉండే హీరో.. అనుకోకుండా ఆ కూతురు చనిపోవడం.. ఆ ఊరి గ్రామ దేవత విగ్రహాన్ని ఎత్తుకుపోవడానికి బయటి వాళ్లు చేసే కుట్ర.. దానిని కాపాడుకోవడం కోసం ఊళ్లో వాళ్లు చేసే ప్రయత్నాలు.. ఇలా సాగిపోతుందీ మహాసేన మూవీ.

థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే ఐఎండీబీలో మాత్రం ఏకంగా 9.2 రేటింగ్ నమోదవడం విశేషం. తమిళంలో తరచూ ఇలాంటి మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. ఆ కోవలోనిదే ఈ మహాసేన కూడా. ఈ సినిమాను జనవరి 13 నుంచి తమిళంలో ఆహా తమిళం ఓటీటీలో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More