Vijay Ajith: అప్పుడు హగ్.. ఇప్పుడు కారు.. అజిత్ కుమార్‌కు తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చిన గిఫ్ట్ చూశారా?
Vijay Ajith: విజయ్, అజిత్ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తాజాగా అజిత్ కు విజయ్ ఓ మీనియేచర్ కారును గిఫ్ట్ గా ఇవ్వడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.
Vijay Ajith: ఇంగ్లాండ్‌లోని ప్రముఖ సిల్వర్‌స్టోన్ రేస్‌ట్రాక్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్, కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కలసి సందడి చేశారు. లీ మ్యాన్స్ రేసింగ్ ఈవెంట్ సందర్భంగా అజిత్‌ను కలవడానికి విజయ్ ఏకంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఈ అరుదైన రీయూనియన్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రేస్ కారు గిఫ్ట్ ఇచ్చి 'లవ్లీ బ్రదర్' అని సంతకం
ఈ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్‌కు విజయ్ ఒక క్యూట్ మినియేచర్ రేస్ కార్ గిఫ్ట్‌గా అందించారు. దానిపై తమిళంలో "ప్రియముడన్ (ప్రేమతో) విజయ్.. నా లవ్లీ బ్రదర్ అజిత్‌కు" అని స్పెషల్‌గా రాసి సైన్ చేశారు. ఈ ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి అజిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
సమాధానంగా అజిత్ కుమార్ కూడా తను వాడే ఒక రేసింగ్ హెల్మెట్‌పై "లవ్ అజిత్" అని రాసి విజయ్‌కు బహుమతిగా ఇచ్చారు. చెన్నై నుంచి ఇంగ్లాండ్ వెళ్లిన అభిమానులు ఈ సీన్ చూసి ఉత్సాహంతో ఊగిపోయారు.
మూడు దశాబ్దాల ఫ్యాన్ వార్స్‌కి బిగ్ చెక్
గత ముప్పై ఏళ్లుగా తమిళ చిత్రసీమలో విజయ్ (దళపతి), అజిత్ (తలా) ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలోనూ, బయటా విపరీతమైన పోటీ ఉండేది. ఇద్దరి సినిమాలు ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అయితే ఫ్యాన్ వార్స్ నెక్స్ట్ లెవెల్‌లో జరిగేవి. అలాంటిది లండన్ గడ్డపై ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు హగ్ చేసుకోవడం తమిళ సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
స్టేడియంలోని ఫ్యాన్స్ విజయ్ రాగానే 'టీవీకే' అంటూ పొలిటికల్ స్లోగన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో విజయ్ వెంటనే తన చేతులతో సైగ చేస్తూ.. నా కోసం కాదు, రేసింగ్ ట్రాక్‌లో ఉన్న అజిత్ కోసం గట్టిగా అరిచి సపోర్ట్ చేయండి అంటూ ఫ్యాన్స్‌ను కోరడం విశేషం.
వీఐపీ బాల్కనీలో త్రిష మెరుపులు
ఈ రేసింగ్ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, తమిళగ వెట్రి కళగం (TVK) కీలక నాయకుడు ఆధవ్ అర్జున కూడా హాజరయ్యారు. రేస్ ప్రారంభానికి ముందు అజిత్ రేసింగ్ టెంట్‌లో విజయ్, త్రిష కాసేపు సరదాగా గడిపారు. విజయ్ గ్రీన్ ఫ్లాగ్ ఊపి రేస్‌ను ప్రారంభించిన తర్వాత, వీరంతా కలసి బాల్కనీ నుంచి పోటీలను చూశారు.
ఈ ఈవెంట్‌లో మొత్తం 44 మంది రేసర్లు పాల్గొనగా అజిత్ కుమార్ ఓవరాల్‌గా 38వ స్థానంలో నిలిచారు. గ్లోబల్ స్పోర్ట్స్ కామెంటేటర్లు విజయ్, అజిత్‌లను హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్‌లతో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. బ్రాడ్ పిట్ ఎఫ్1 సినిమా తరహాలో అజిత్ కూడా త్వరలోనే ఎఫ్2 రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
ఇద్దరి కెరీర్ అప్‌డేట్స్.. నెక్స్ట్ ఏంటి?
విజయ్ రీసెంట్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, తమిళగ వెట్రి కళగం పార్టీ తరఫున రాబోయే ఎన్నికల రేసులో బిజీ కావడం తెలిసిందే. సినిమా కెరీర్ పరంగా విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ వివాదాలు, ఆన్‌లైన్ లీక్ సమస్యలను దాటుకుని ఈ ఏడాది జులై 23న థియేటర్లలో రిలీజ్ అయి మంచి బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది.
ఇటు అజిత్ కుమార్ రీసెంట్‌గా త్రిష కాంబినేషన్‌లో 'విదాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో ఆడియన్స్‌ను అలరించారు. ప్రస్తుతం అజిత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'డేర్ డెవిల్' షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. అలాగే తీరిక దొరికినప్పుడల్లా ఇంటర్నేషనల్ రేసింగ్ సర్క్యూట్స్‌లో పాల్గొంటూ తన ప్యాషన్‌ను కొనసాగిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


