Vijay Ajith: 30 ఏళ్ల పోటీకి తెరదించిన హీరోలు విజయ్, అజిత్- లండన్‌లో ఊహించని కలయిక- ఆప్యాయంగా హగ్ చేసుకున్న సీఎం- వీడియో

CM Vijay Ajith Re Unite In London Silverstone Racing: యూకేలోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, ప్రముఖ హీరో అజిత్ కుమార్ కలుసుకున్నారు. మూడు దశాబ్దాల సినీ పోటీకి తెరదించితూ వీరిద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Published on: Sep 13, 2026, 06:25:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CM Vijay Ajith Re Unite In London Silverstone Racing: బ్రిటన్ వేదికగా జరిగిన 'మిచెలిన్ లీ మాన్స్ కప్' రేసింగ్ ఈవెంట్ ఒక అరుదైన, మరచిపోలేని దృశ్యానికి వేదికైంది. వెండితెరపై ప్రత్యర్థులుగా, బయట ప్రాణస్నేహితులుగా ఉండే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, కోలీవుడ్ స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ ఒకరినొకరు ఆప్యాయంగా కలుసుకున్నారు.

30 ఏళ్ల పోటీకి తెరదించిన హీరోలు విజయ్, అజిత్- లండన్‌లో ఊహించని కలయిక- ఆప్యాయంగా హగ్ చేసుకున్న సీఎం- వీడియో
30 ఏళ్ల పోటీకి తెరదించిన హీరోలు విజయ్, అజిత్- లండన్‌లో ఊహించని కలయిక- ఆప్యాయంగా హగ్ చేసుకున్న సీఎం- వీడియో

ఆప్యాయంగా ఆహ్వానించిన అజిత్

సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో విజయ్ పరుగెత్తుకుంటూ వచ్చి అజిత్‌ను గట్టిగా కౌగిలించుకున్న దృశ్యం సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అవుతోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ యూకే పర్యటనకు వెళ్లగా, ఈ రేసింగ్ టోర్నీ సందర్భంగా అజిత్ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు.

గత 34 ఏళ్లుగా సహచరులుగా ఉన్నాం

బిజీ షెడ్యూల్‌లోనూ తన రేసింగ్ ఈవెంట్‌కు విచ్చేసిన దళపతి విజయ్‌కి అజిత్ కృతజ్ఞతలు తెలిపారు. "గత 34 ఏళ్లుగా మేము తమిళ సినీ పరిశ్రమలో సహచరులుగా ప్రయాణించాం. ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అని అజిత్ అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో సంతోషం వ్యక్తం చేశారు.

చెన్నైలో లీ మాన్స్ రేసింగ్ రావాలి!

భారతదేశంలో, తమిళనాడులో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అజిత్ కొనియాడారు. మోటార్ స్పోర్ట్స్‌కు అవసరమైన మౌలిక వసతులు, లాజిస్టిక్స్‌ను స్వయంగా పరిశీలించేందుకే సీఎం విజయ్ ఈ ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి వచ్చారని తెలిపారు.

అజిత్ ప్రతిపాదన

"లీ మాన్స్ వంటి అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్లను మన భారత్‌కు, ముఖ్యంగా చెన్నైకి తీసుకురావాలనేదే నా ఆకాంక్ష. మేమందరం స్వదేశంలో రేసింగ్‌లో పాల్గొనే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను" అని అజిత్ తన ప్రతిపాదనను పంచుకున్నారు.

మూడు దశాబ్దాల పోటీ.. చెరిగిపోని స్నేహం

తమిళనాట విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఉండే బాక్సాఫీస్ పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1992లో 'నాళైయ తీర్పు' సినిమాతో విజయ్, 1993లో 'అమరావతి'తో అజిత్ హీరోలుగా రంగప్రవేశం చేశారు. 3 దశాబ్దాలుగా (30 ఏళ్లు) వీరిద్దరి సినిమాలు థియేటర్లలో పోటీ పడుతుంటే అభిమానులు సోషల్ మీడియాలో 'అనిల్స్' (విజయ్ ఫ్యాన్స్), 'ఆమైస్' (అజిత్ ఫ్యాన్స్) అని సరదా పేర్లతో హంగామా చేసేవారు.

వ్యక్తిగతంగా గాఢమైన అనుబంధం

వెండితెరపై ఎంతటి పోటీ ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఉందని అజిత్ భార్య శాలిని కూడా గతంలో వెల్లడించారు. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించే సంస్కృతి వీరిద్దరి సొంతమని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న ఫ్యాన్ వార్స్‌కు శుభం కార్డు వేస్తూ లండన్‌లో వీరిద్దరూ కౌగిలించుకున్న దృశ్యం అభిమానులకు కంటికి పండుగలా మారింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: లండన్‌లో సీఎం విజయ్, అజిత్ ఎక్కడ కలుసుకున్నారు?

A1: బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్ వద్ద జరిగిన 'మిచెలిన్ లీ మాన్స్ కప్' రేసింగ్ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు.

Q2: అజిత్ కుమార్ సినీ రంగానికి ఎప్పుడు పరిచయమయ్యారు?

A2: అజిత్ కుమార్ 1993లో వచ్చిన 'అమరావతి' సినిమాతో కథానాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

Q3: అజిత్ రేసింగ్ టోర్నీని సీఎం విజయ్ ఎందుకు సందర్శించారు?

A3: తమిళనాడులో మోటార్ స్పోర్ట్స్ అభివృద్ధికి, అంతర్జాతీయ రేసింగ్ పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు సీఎం విజయ్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.

Q4: విజయ్, అజిత్ అభిమానులను సోషల్ మీడియాలో ఏ పేర్లతో పిలుస్తారు?

A4: తమిళ సామాజిక మాధ్యమాల్లో విజయ్ అభిమానులను 'అనిల్స్' అని, అజిత్ అభిమానులను 'ఆమైస్' అని సంబోధిస్తుంటారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More