...
...
Next Story

Vijay Marks Sheet: విజయ్ పదో తరగతి మార్కులు చూశారా? తమిళనాడు కాబోయే సీఎం మ్యాథ్స్‌లో వీకే

Vijay Marks Sheet: తమిళ స్టార్ నటుడు, టీవీకే (TVK) అధినేత, తమిళనాడు కాబోయే సీఎం విజయ్ పదో తరగతి మార్కుల మెమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయనేది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Published on: May 8, 2026, 21:14:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Vijay Marks Sheet: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైన 'దళపతి' విజయ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఆయన నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత సక్సెస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే విద్యార్థిగా విజయ్ ప్రస్థానం ఎలా సాగింది? ఆయనకు పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? అనే వివరాలు వెల్లడిస్తూ ఒక మార్క్ షీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మ్యాథ్స్‌లో కష్టపడ్డ విజయ్

Vijay Marks Sheet: విజయ్ పదో తరగతి మార్కులు చూశారా? తమిళనాడు కాబోయే సీఎం మ్యాథ్స్‌లో వీకే
Vijay Marks Sheet: విజయ్ పదో తరగతి మార్కులు చూశారా? తమిళనాడు కాబోయే సీఎం మ్యాథ్స్‌లో వీకే

వైరల్ అవుతున్న మార్కుల జాబితా ప్రకారం.. విజయ్ పదో తరగతిలో సగటున 65% మార్కులు సాధించారు. అయితే ఆయనకు గణితం (Mathematics) అంటే కొంచెం కష్టమని ఈ మార్కులను చూస్తుంటే అర్థమవుతోంది. మ్యాథ్స్‌లో 200 మార్కులకు గానూ విజయ్ కేవలం 95 మార్కులు మాత్రమే సాధించారు. ఇది ఆయన స్కోర్ చేసిన సబ్జెక్టులన్నింటిలోనూ అత్యల్పం కావడం గమనార్హం.

తమిళంలో టాప్.. సైన్స్‌లో జోరు

లెక్కల్లో కాస్త వెనుకబడినప్పటికీ, విజయ్ తన మాతృభాష తమిళంలో మాత్రం మంచి ప్రతిభ కనబరిచారు. తమిళ సబ్జెక్టులో ఆయనకు 200 కి 155 మార్కులు వచ్చాయి. అలాగే సైన్స్‌లో 300 మార్కులకు గానూ 206 మార్కులు సాధించి మెప్పించారు. మొత్తంగా 1100 మార్కులకు విజయ్ 711 మార్కులు సాధించి 'ఫస్ట్ క్లాస్'లో ఉత్తీర్ణులయ్యారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వైరల్

విజయ్ తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) స్థాపించి, రాజకీయాల్లో యాక్టివ్ అయినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో విజయ్ పాత జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇక తమిళనాడు కాబోయే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తన టీవీకేకు వచ్చిన 107 స్థానాలకు తోడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వడంతో మొత్తం 118 మంది సభ్యుల బలం విజయ్ కు తోడైంది. దీంతో మ్యాజిక్ మార్క్ దాటేశారు. శనివారం (మే 9) ఉదయం 11 గంటలకే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: విజయ్‌కి పదో తరగతిలో అత్యధిక మార్కులు ఏ సబ్జెక్టులో వచ్చాయి?

జవాబు: ఆయనకు సైన్స్ (206/300), తమిళం (155/200) సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చాయి.

ప్రశ్న: విజయ్ మ్యాథ్స్‌లో పాస్ అయ్యారా?

జవాబు: అవును, విజయ్ మ్యాథ్స్‌లో 200కి 95 మార్కులు సాధించి పాస్ అయ్యారు.

ప్రశ్న: విజయ్ రాజకీయ పార్టీ పేరేంటి?

జవాబు: విజయ్ స్థాపించిన పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం (TVK).

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe