OTT Movie: 50 రిజెక్షన్ల తర్వాత దొరికిన లవర్.. సాయంత్రం 6 తర్వాత చూడకూడదు.. ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ
OTT Movie: ఓటీటీలోకి ఓ తమిళ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. రొమాంటిక్ కామెడీకి సైన్స్ ఫిక్షన్ ట్విస్ట్ ఇస్తూ సాగే ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Movie: తమిళ యంగ్ హీరో రియో రాజ్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ‘రామ్ అండ్ లీల’ (Ram and Leela) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో వినూత్న కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ డిజిటల్ ప్రీమియర్ అయింది.

రొమాంటిక్ కామెడీకి సైన్స్ ఫిక్షన్ ట్విస్ట్
30 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాక 50 సార్లు వరుసగా రిజెక్షన్స్ ఎదుర్కొన్న ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్‌లోకి అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే విచిత్రమైన పరిస్థితితో యంగ్ హీరో రియో రాజ్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా 'రామ్ అండ్ లీల'.
లోకల్ ట్రైన్ ప్రయాణంలో ఊహించని లవ్ స్టోరీ
రఘురామ్ అలియాస్ రామ్ అనే 30 ఏళ్ల కుర్రాడు పెళ్లి చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటాడు. మ్యాట్రిమోనియల్ సైట్లలో, పెళ్లి చూపుల్లో వరుసగా 50 సార్లు రిజెక్షన్లు ఫేస్ చేసి తీవ్ర నిరాశలో ఉన్న టైమ్‌లో ఒక లోకల్ రైలు ప్రయాణంలో లీల అనే అమ్మాయి పరిచయమవుతుంది.
రామ్ లవ్ ప్రతిపాదనకు లీల వెంటనే ఓకే చెబుతుంది. కానీ, అక్కడే ఒక విచిత్రమైన కండిషన్ పెడుతుంది. తనను పెళ్లి చేసుకోవాలంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ తన వైపు చూడకూడదని లీల రూల్ విధిస్తుంది. మొదట్లో ఇది సరదా కండిషన్ అని అనుకున్నా, అసలు రాత్రి వేళల్లో లీల ఏం చేస్తుందో తెలుసుకోవాలని రామ్ చేసే పిచ్చి ప్రయత్నాలు, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య విపరీతమైన కన్ఫ్యూజన్‌కు దారితీస్తాయి.
అనున్కాకి ఏలియన్.. షాకింగ్ సైన్స్ ఫిక్షన్ ట్విస్ట్
కేవలం ఒక సరదా రొమాంటిక్ కామెడీగా సాగుతున్న ఈ కథలో సెకండాఫ్‌లో వచ్చే సస్పెన్స్ ప్రేక్షకులకు పిచ్చి క్రేజ్ ఇస్తుంది. లీల కుటుంబానికి ప్రాచీన ఏలియన్ జాతి అయిన 'అనున్నాకి' (Anunnaki) రక్తసంబంధం ఉంటుంది. సూర్యాస్తమయం కాగానే లీల శరీరంలో ఒక రకమైన సూపర్ నేచురల్ బయోలాజికల్ మార్పులు మొదలవుతాయి.
ఈ నిజం తెలిసిన తర్వాత రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? వాళ్ల ప్రేమ గెలిచిందా లేదా అనేది సినిమాకు అసలైన హైలైట్. కామెడీ వెనక ఉన్న ఈ సైంటిఫిక్ పాయింట్ ఓటీటీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
టైటిల్ వివాదం.. గ్రాండ్ ఓటీటీ రిలీజ్
డైరెక్టర్ రామచంద్రన్ కణ్ణన్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాగా, వర్తిక చేతన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఈ సినిమాకి ‘రామ్ ఇన్ లీల’ అని పేరు పెట్టారు. కానీ కొన్ని వివాదాలు, సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో ‘రామ్ అండ్ లీల’గా మార్చారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది.
ఈ సినిమాలో మునీష్ కాంత్, మాళవికా అవినాష్, దీపా వెంకట్, మా కా పా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. అంకిత్ మీనన్ అందించిన మ్యూజిక్ సినిమాకి మంచి హైలైట్‌గా నిలిచింది. మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ, వైఎన్‌సి శివ ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకున్నాయి.
రియో రాజ్ కెరీర్.. ఓటీటీ ఆడియన్స్ రెస్పాన్స్
బుల్లి తెరపై యాంకర్‌గా ప్రయాణం ప్రారంభించిన రియో రాజ్.. ‘నెంజుమండు నేర్మైయుండు ఓడు రాజా’, రీసెంట్ హిట్ ‘జో’ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు 'రామ్ అండ్ లీల' సినిమాతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడానికి ప్రైమ్ వీడియోలోకి వచ్చేశారు. విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడేవారు ఈ వీకెండ్ డిజిటల్ వాచ్ లిస్ట్‌లో ఈ చిత్రాన్ని యాడ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


