...
...
Next Story

OTT: ఓటీటీలోకి ధనుష్ తండ్రి నటించిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా.. 9.2 ఐఎండీబీ రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT: ఓటీటీలోకి ఓ రొమాంటిక్ ఎమోషనల్ తమిళ సినిమా రాబోతోంది. ఈ మూవీ పేరు హబీబి. ధనుష్ తండ్రి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కస్తూరి రాజా నటించిన ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Sep 21, 2026, 15:24:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT: కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, ఫేమస్ డైరెక్టర్ సెల్వరాఘవన్ తండ్రి, సీనియర్ యాక్టర్-డైరెక్టర్ కస్తూరి రాజా ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా 'హబీబి' (Habeebi) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

లవ్, ఎమోషన్స్ నిండిన కథ.. కస్తూరి రాజా వన్ మ్యాన్ షో!

OTT: ఓటీటీలోకి ధనుష్ తండ్రి నటించిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా.. 9.2 ఐఎండీబీ రేటింగ్..  తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT: ఓటీటీలోకి ధనుష్ తండ్రి నటించిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా.. 9.2 ఐఎండీబీ రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఏడాది జూన్ 12న థియేటర్లలో రిలీజైన ఈ పీరియాడిక్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ముస్లిం కుటుంబ నేపథ్యం, అందులోని ప్రేమానురాగాలు, సామాజిక పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడానికి రెడీ అయింది.

దర్శకుడు మీరా కతిరవన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి విఎస్ మహమ్మద్ అమీన్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ అందించారు. మారుతున్న సమాజంలో తన పాతకాలపు విలువలు, అనుబంధాలను పట్టుకుని తాపత్రయపడే 'యూసుఫ్' అనే పాత్రలో కస్తూరి రాజా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఒక ముస్లిం కుటుంబంలో సాగే నిశ్శబ్దమైన ప్రేమ, ఆ వాతావరణంలో ఉత్పన్నమయ్యే సంఘర్షణలను చాలా ఆర్ద్రంగా చూపించారు. రోమియో పిక్చర్స్, నేసమ్ ఎంటర్‌టైన్‌మెంట్, జీకేఎస్ బ్రదర్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

అంబేద్కర్, పెరియార్ ఆలోచనలతో పర్వీన్

ఈ సినిమాలో మాళవికా మనోజ్, ధనశ్రీ సుధాకరన్, అరుళ్ కుమార్, అనుశ్రేయా రాజన్ కీలక పాత్రలు పోషించారు. కథలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ధనశ్రీ సుధాకరన్ నటించిన 'పర్వీన్' క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది.

సినిమాకు అసలైన ప్లస్ పాయింట్ సామ్ సీఎస్ అందించిన మ్యూజిక్. కథలోని ఎమోషనల్ సీన్స్‌ను తన సోల్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆయన నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. యుగభారతి, కార్తీక్ నేతా, మషూక్ రెహమాన్ రాసిన లిరిక్స్ పాటలకు మంచి ప్రాణం పోశాయి.

మహేష్ ముత్తుస్వామి సినిమాటోగ్రఫీ గ్రామీణ, సాంప్రదాయ వాతావరణాన్ని కెమెరాలో ఎంతో అందంగా బంధించగా, మతి విఎస్ ఎడిటింగ్, అప్పుణ్ణి సాజన్ ఆర్ట్ డైరెక్షన్ వర్క్ సినిమాకి రిచ్ లుక్‌ను తీసుకొచ్చాయి. క్లాసిక్ లవ్ స్టోరీలు, గుండెను తాకే ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కి 'హబీబి' ఒక పర్ఫెక్ట్ వాచ్ కానుంది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 25) నుంచి ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks