డైరెక్టర్‌గా స్టార్ హీరో విజయ్ కొడుకు.. సందీప్ కిషన్‌తో సినిమా.. నిధి వేట కథతో థ్రిల్లర్.. టైటిల్ ఇదే
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. సందీప్ కిషణ్ హీరోగా యాక్షన్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు.
తమిళ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న జాసన్ తొలి చిత్రం పేరు ‘సిగ్మా’. ఇందులో సందీప్ కిషన్ హీరో. ఈ సినిమా టైటిల్‌ను, సందీప్ ఫస్ట్ లుక్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేశారు.

సిగ్మా సినిమాతో
సోమవారం (నవంబర్ 10) లైకా ప్రొడక్షన్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘జేఎస్జే01-సిగ్మా టైటిల్‌ను అందిస్తున్నాము. అన్వేషణ మొదలవుతుంది" అని రాసింది. ఈ పోస్టర్‌లో సందీప్ కిషన్ బంగారం కడ్డీలు, నగదుపై కూర్చుని, తన చేతికి ఉన్న గాయానికి చికిత్స చేసుకుంటున్నట్లు, కట్టు కట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది.
సందీప్ కిషన్ హీరో
జాసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్న సిగ్మా సినిమాలో సందీప్ కిషన్ హీరో. సందీప్ కిషన్ కూడా ఈ చిత్రం టైటిల్‌ను, తన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ టైటిల్ వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ, అతను ఇలా రాశాడు. "జాసన్ సంజయ్ 01 - సిగ్మా. మీ ప్రేమ, ఆశీస్సులు కావాలి. మీరు మీపై ఎప్పుడూ ఆశ వదులుకోనప్పుడు, ముఖ్యంగా ఈ అన్యాయమైన ప్రపంచంలో మీరు ఒక 'సిగ్మా' అవుతారు. జాసన్ సంజయ్ మిమ్మల్ని ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లో తీసుకువెళతారు" అని సందీప్ పోస్టు చేశాడు.
సిగ్మా గురించి
సిగ్మా సినిమా అనేది యాక్షన్-అడ్వెంచర్-కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఒక నిధి వేటతో పాటు అధిక రిస్క్‌తో కూడిన దోపిడీ (హైస్ట్) గురించి వివరిస్తుంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చెన్నై, సేలం, తలకోన, థాయ్‌లాండ్‌లలో నాలుగు నెలలకు పైగా జరిగింది. ఇందులో 95% షెడ్యూల్ పూర్తయింది. ఒక పాట షూటింగ్ మిగిలి ఉంది.
సందీప్-జాసన్ కాంబినేషన్లో వస్తున్న సిగ్మా సినిమాలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు.
సిగ్మా కాన్సెప్ట్
జాసన్ ఒక పత్రికా ప్రకటనలో 'సిగ్మా' కాన్సెప్ట్‌ను కూడా వివరించాడు. "ఈ టైటిల్కా, న్సెప్ట్ ‘సిగ్మా’ భయం లేని స్వతంత్ర స్ఫూర్తిని, అంటే సామాజిక నిబంధనలకు కట్టుబడకుండా తన సొంత మార్గాన్ని అనుసరించే వ్యక్తిని సూచిస్తుంది" అని అన్నాడు. నిర్మాతలు ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో 2026 వేసవి ఆరంభంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.













