Tanya Mishra: రష్మిక, త్రిప్తి దిమ్రి తర్వాత కొత్త నేషనల్ క్రష్-ఎవరీ తాన్యా మిశ్రా? కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న బ్యూటీ!

Tanya Mishra: సోషల్ మీడియాలో ఇటీవల విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు ‘తాన్యా మిశ్రా’. నెటిజన్లు ఆమెకు ఏకంగా "ఇండియాస్ న్యూ నేషనల్ క్రష్" అని పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడల్, నటి తాన్యా మిశ్రా గురించిన వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Sep 29, 2026, 11:58:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tanya Mishra: గతంలో రష్మిక మందన్నా, త్రిప్తి దిమ్రి వంటి హీరోయిన్లను అభిమానులు "నేషనల్ క్రష్"గా పిలిచారు. ప్రస్తుతం అలాగే సోషల్ మీడియాలో తాన్యా మిశ్రా (Tanya Mishra) పేరు మార్మోగిపోతోంది. ఈ బ్యూటీని నేషనల్ క్రష్ అంటూ నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ క్రేజ్‌తో తాన్యా మిశ్రా ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే అంశాలను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

రష్మిక, త్రిప్తి దిమ్రి తర్వాత కొత్త నేషనల్ క్రష్-ఎవరీ తాన్యా మిశ్రా? కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న బ్యూటీ! (instagram-Tanyaa mishra)
రష్మిక, త్రిప్తి దిమ్రి తర్వాత కొత్త నేషనల్ క్రష్-ఎవరీ తాన్యా మిశ్రా? కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న బ్యూటీ! (instagram-Tanyaa mishra)

తాన్యా మిశ్రా ఎవరు?

తాన్యా మిశ్రా 1999 జనవరి 31న బీహార్‌లోని గయాలో జన్మించింది. మగధ్ యూనివర్సిటీ నుంచి బి.కామ్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో స్థిరపడేందుకు ముంబైకి మకాం మార్చింది. 2019లో జరిగిన IAWA మిస్ ఇండియా పోటీల్లో ఫోర్త్ రన్నరప్‌గా నిలిచి తొలిసారి వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత తాన్యా శర్మ మోడలింగ్ రంగంలో రాణిస్తూ ఫెమినా (Femina), ఫిలింఫేర్ (Filmfare), గ్రాజియా (Grazia) వంటి ప్రసిద్ధ మ్యాగజైన్ల కవర్ పేజీలపై మెరిసింది. ముఖ్యంగా 2024 ఏప్రిల్-మే ఫెమినా ఇష్యూ కవర్‌పేజీపై ఆమె కనిపించడం పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

సినిమాల్లో సీబీఐ ఆఫీసర్‌గా

మోడలింగ్‌లో రాణించిన తాన్యా.. ఆ తర్వాత నటనపై దృష్టి పెట్టింది. 'గజ్నవి' (Ghaznavi), 'చేజ్' (Chase) వంటి చిత్రాల్లో నటించింది. 'చేజ్' సినిమాలో ఆమె ఒక పవర్‌ఫుల్ సీబీఐ ఇన్‌స్పెక్టర్ పాత్రలో అదరగొట్టింది. ఇక ఓటీటీ డిజిటల్ స్పేస్‌లో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ 'చిడియా ఉడ్' (Chidiya Udd) వెబ్ సిరీస్. ఈ సిరీస్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్, సికందర్ ఖేర్, భూమిక చావ్లా వంటి నటులతో కలిసి ఆమె స్క్రీన్ స్పేస్ పంచుకోవడం విశేషం.

మ్యూజిక్ వీడియోల్లో

పాటల విషయానికి వస్తే.. 'నఖ్రో' (Nakhro), 'తూ మేరా హో జాయేగా' (Tu Mera Ho Jaeyga) వంటి పాపులర్ మ్యూజిక్ వీడియోలలో తాన్యా అదరగొట్టింది. జుబిన్ నౌటియాల్, ఆనంద్ రాజ్ ఆనంద్, జావైద్ అలీ, షాహిద్ మాల్య వంటి పాపులర్ స్టార్ల ఆల్బమ్‌లలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

డేటింగ్ రూమర్స్

తాన్యా మిశ్రా క్రేజ్ పెరుగుతుండటంతో ఆమె పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్‌లపై కూడా గూగుల్‌లో సెర్చెస్ పెరిగాయి. అయితే ప్రస్తుతం ఆమె ఎవరితోనూ డేటింగ్‌లో లేరని, ఆమె ఒంటరిగానే తన కెరీర్‌పై దృష్టి పెడుతున్నారని సమాచారం.

ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్లకు పైగా ఉన్న ఫాలోవర్లతో తాన్యా నిరంతరం తన గ్లామరస్ ఫోటోషూట్‌లు, ఫ్యాషన్ అప్‌డేట్‌లను పంచుకుంటూ ఉంటుంది. ఈ సోషల్ మీడియా పాపులారిటీయే ఆమెను నేడు "నేషనల్ క్రష్" ట్రెండ్‌లో నిలబెట్టి, పరిశ్రమలో మరిన్ని అవకాశాలు దక్కేలా చేస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More