...
...
Next Story

Toxic Tickets: టాక్సిక్ టికెట్ల రేట్లు పెంచుకోండి.. కానీ రూ. కోటి ఇవ్వాల్సిందే: తెలంగాణ ప్రభుత్వం జీవో

Toxic Tickets Rate Hike In Telangana: తెలంగాణలోనూ టాక్సిక్ మూవీ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు రోజుకు ఐదు షోల పాటు ప్రదర్శించే అవకాశం కూడా కల్పించారు. అయితే మూవీ ప్రొడ్యూసర్స్ కచ్చితంగా కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ఇవ్వాల్సిందేనన్న నిబంధన విధించారు.

Published on: Aug 25, 2026, 14:29:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Toxic Tickets Rate Hike In Telangana: రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఊరట ఇచ్చింది. తెలంగాణలో 'టాక్సిక్' సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ అఫీషియల్ జీవో జారీ చేసింది.

10 రోజుల పాటు పెరిగిన టికెట్ రేట్లు.. కొత్త ధరల వివరాలు ఇవే

Toxic Tickets: టాక్సిక్ టికెట్ల రేట్లు పెంచుకోండి.. కానీ రూ. కోటి ఇవ్వాల్సిందే: తెలంగాణ ప్రభుత్వం జీవో
Toxic Tickets: టాక్సిక్ టికెట్ల రేట్లు పెంచుకోండి.. కానీ రూ. కోటి ఇవ్వాల్సిందే: తెలంగాణ ప్రభుత్వం జీవో

తెలంగాణ ప్రభుత్వ జీవో ప్రకారం.. టాక్సిక్ మూవీ కోసం ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి ఈ పెంపు వర్తిస్తుంది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 50 అదనంగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దీంతో సింగిల్ స్క్రీన్స్ రేటు రూ. 227 కి చేరింది. ఇక మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ స్క్రీన్స్‌లలో టికెట్‌పై రూ. 100 వరకు పెంచుకోవచ్చు. దీంతో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ. 395 గా మారింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ కానున్నాయి.

రోజుకు 5 షోలకు అనుమతి.. సినీ కార్మికుల సంక్షేమానికి రూ. కోటి

టికెట్ రేట్ల పెంపుతో పాటు తెలంగాణలో రోజుకు 5 రెగ్యులర్ షోలు ప్రదర్శించడానికి థియేటర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఈ సినిమాకు దక్కింది.

అలాగే జీవోలో ఒక ప్రత్యేక కండిషన్ కూడా విధించారు. నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations LLP) కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ అకౌంట్‌కు రూ. కోటి విరాళంగా జమ చేయాలని ఆదేశించారు. సినీ కార్మికుల సంక్షేమానికి ఈ ఫండ్ ఉపయోగపడనుంది.

'కేజీఎఫ్ 2' లాంటి ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత యశ్ నటిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ కావడంతో 'టాక్సిక్' పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను విభిన్నమైన డార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.

ఈ సినిమాలో సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి క్రేజీ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 'యాక్షన్ థ్రిల్లర్' బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe