OTT Telugu: ఓటీటీలోకి ఓ బోల్డ్ తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. మార్చి 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పేరు మెన్షన్ హౌస్ మల్లేష్ (Mansion House Mallesh). మగతనం నిరూపించుకుంటే భూమి వస్తుందని ఆశ పడే హీరో.. ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. ఐఎండీబీలో 8.6 రేటింగ్ ఉంది. ఆ వివరాలేంటో చూడండి.
మెన్షన్ హౌస్ మల్లేష్ ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగులో మరో భిన్నమైన కథతో వచ్చిన మూవీ ఈ మెన్షన్ హౌస్ మల్లేష్. మార్చి 6న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు 50 రోజుల తర్వాత అంటే వచ్చే సోమవారం (ఏప్రిల్ 27) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. “రెడీయా.. ఊర మాస్ స్టార్ అవుతోంది” అంటూ ఆ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ విషయం తెలిపింది.
మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ స్టోరీ ఇలా..
శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'మెన్షన్ హౌస్ మల్లేష్'. తండ్రి బాటలోనే తాగుడుకు బానిసైన ఒక యువకుడి జీవితం.. పెళ్లి తర్వాత ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ.
మల్లేష్ (శ్రీనాథ్ మాగంటి) అనే సాధారణ గ్రామీణ యువకుడు చిన్నతనం నుంచే తాగుడుకు బానిసవుతాడు. అయితే అతనికి తన బావ అయిన చిన్న పటేల్ (రాజేష్)తో గొడవలు ఉంటాయి. ఈ క్రమంలో తల్లి బలవంతం మీద జ్యోతి (గాయత్రీ రమణ)ని మల్లేష్ పెళ్లి చేసుకుంటాడు.
అయితే శోభనం రాత్రే మల్లేష్‌కు ఒక ఊహించని షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ రహస్యం ఏమిటి? దానివల్ల మల్లేష్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? చిన్న పటేల్ సవాలును మల్లేష్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. మగతనం నిరూపించుకొని భూమిని పొందాల్సిన పరిస్థితుల్లో ఆ యువకుడు ఎలాంటి పనులు చేశాడన్నది ఫన్నీగా ఈ సినిమాలో చూపించారు.
పెళ్లి తర్వాత వచ్చే మలుపులు, ఎమోషనల్ సీన్లు సినిమాకు బలంగా నిలిచాయి. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం, పాతకాలపు సీన్లు కొంచెం బోర్ కొట్టిస్తాయి. మల్లేష్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి చక్కగా ఒదిగిపోయాడు. ఈ చిన్న సినిమా మార్చి 6న థియేటర్లలో వచ్చినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడాలనుకుంటే ఏప్రిల్ 27 నుంచి రెడీగా ఉండండి.
{{/usCountry}}పెళ్లి తర్వాత వచ్చే మలుపులు, ఎమోషనల్ సీన్లు సినిమాకు బలంగా నిలిచాయి. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం, పాతకాలపు సీన్లు కొంచెం బోర్ కొట్టిస్తాయి. మల్లేష్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి చక్కగా ఒదిగిపోయాడు. ఈ చిన్న సినిమా మార్చి 6న థియేటర్లలో వచ్చినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడాలనుకుంటే ఏప్రిల్ 27 నుంచి రెడీగా ఉండండి.
{{/usCountry}}