ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ వస్తోంది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉండటం విశేషం. బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్ లాంటి నటులు ఇందులో నటించారు.
కర్మణ్యే వాధికారస్తే ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగులో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కర్మణ్యే వాధికారస్తే. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. శుక్రవారం (నవంబర్ 21) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. “కర్మణ్యే వాధికారస్తే రేపు వస్తోంది. చాలా లోతుగా మనసును తాకే స్టోరీ కోసం సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. మూవీకి సంబంధించిన చిన్న టీజర్ ను పోస్ట్ చేసింది.
కర్మణ్యే వాధికారస్తే మూవీ గురించి..
కర్మణ్యే వాధికారస్తే సినిమాను అమర్‌దీప్ చల్లపల్లి డైరెక్ట్ చేశాడు. ఇందులో ఐరా దయానంద్, బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్, పృథ్వీరాజ్, శివాజీ రాజాలాంటి వాళ్లు నటించారు. జ్ఞాని మ్యూజిక్ అందించాడు. ఉషస్విని ఫిల్మ్స్ మూవీని నిర్మించింది. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైనా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం 8.8 రేటింగ్ నమోదైంది.
ఆయుధాల అక్రమ రవాణా, గూఢచర్యం గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొందరు అధికారుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సస్పెన్షన్ కు గురైన ఎన్ఐఏ ఏజెంట్, ఓ ఏసీపీ, ఓ కానిస్టేబుల్ కలిసి ఈ ఇన్వెస్టిగేట్ చేస్తారు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాని ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇదే సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (నవంబర్ 21) నుంచి తమిళ సినిమా డీజిల్, కన్నడ మూవీ ఉసిరు కూడా స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఇక ఇప్పటికే ఎక్కా, దండకారణ్యంలాంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
{{/usCountry}}ఇదే సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (నవంబర్ 21) నుంచి తమిళ సినిమా డీజిల్, కన్నడ మూవీ ఉసిరు కూడా స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఇక ఇప్పటికే ఎక్కా, దండకారణ్యంలాంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
{{/usCountry}}