తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది.. కథ ఇంకా ముగియలేదంటూ అనౌన్స్ చేసిన ఓటీటీ
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ మంగళవారం (నవంబర్ 4) అనౌన్స్ చేసింది. కథ ఇంకా మిగిలే ఉందంటూ ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. ఆ సిరీస్ గురించి తెలుసుకోండి.
తెలుగులో ఈ మధ్యే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రముఖ నటి వర్ష బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది. తమ కథను కానీ కొట్టారంటూ మరో ఓటీటీలోని వెబ్ సిరీస్ పై ఆరోపణల ద్వారా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ వస్తుండటం ఆసక్తి రేపుతోంది.

కానిస్టేబుల్ కనకం రెండో సీజన్
ఈటీవీ విన్ ఓటీటీ నుంచి వచ్చిన హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం నుంచి రెండో సీజన్ వస్తోంది. వచ్చే నెలలోనే దీనిని తీసుకురానున్నట్లు మంగళవారం (నవంబర్ 4) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. “మీరు మళ్లీ చూస్తున్నారు. మేము మిమ్మల్ని చూస్తున్నాం. కనకం వచ్చే నెలలో డబుల్ ఫైర్ తో మళ్లీ వస్తోంది. సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఆ పోస్టర్ పై కూడా టెక్ట్స్ రాసి ఉంది. అందులో ఇలా ఉంది.. “మీరందరూ కానిస్టేబుల్ కనకంను మళ్లీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి వ్యూ, ప్రతి మెసేజ్, చంద్రిక ఎక్కడ అనే ప్రతి మాట దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. కానీ స్టోరీ ఇక్కడితో ముగియలేదు.. మరికొన్ని రోజు వేచి చూడండి.. ఎందుకంటే రెండో సీజన్ వచ్చే నెలలో వస్తోంది. థ్రిల్స్, మిస్టరీ, ఎమోషన్స్ ని డబుల్ చేయడానికి వచ్చేస్తోంది.. తుఫాను కోసం సిద్ధంగా ఉండండి” అని ఈటీవీ విన్ పోస్ట్ చేసింది.
కానిస్టేబుల్ కనకం గురించి..
కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ సుమారు మూడు నెలల కిందట ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కానిస్టేబుల్ దిమ్మల కనక మహాలక్ష్మి అనే పాత్రలో వర్ష బొల్లమ్మ నటించింది. హెడ్ కానిస్టేబుల్ గా సీనియర్ నటుడు రాజీవ్ కనకాల కనిపించాడు.
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేశాడు. తొలి సీజన్ లో ఆరు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. ఓ ఊళ్లో కొత్తగా పెళ్లయిన అమ్మాయి మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుండటంతో మరింత ఆసక్తి రేపుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


