Mayookha Trailer: పాయల్ చెంగప్ప లీడ్ రోల్‌లో నటించిన మైండ్ బ్లోయింగ్ ఫిమేల్ సెంట్రిక్ హారర్ థ్రిల్లర్ మూవీ 'మయూఖ' ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్లా నిర్మించిన ఈ ఇంటెన్స్ డ్రామాకి శ్రీ తేజ్ ఎస్.కే దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ పాల్గొని అక్టోబర్ 9న దసరా కానుకగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నామని టీమ్ ధీమా వ్యక్తం చేసింది.
గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నటీనటుల కామెంట్స్
ఈ ఈవెంట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ షణ్ముఖ్ చరణ్ మాట్లాడుతూ.. "మయూఖ సినిమాలో నేను వీరు అనే రోల్ చేశాను. ఈ క్యారెక్టర్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. నన్ను నమ్మి ఈ మంచి ఛాన్స్ ఇచ్చిన మన డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి స్పెషల్ థాంక్స్" అని తెలిపారు.
బేబీ మాది నస్రీన్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నేను చిన్నప్పటి మయూఖగా కనిపించబోతున్నాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. అక్టోబర్ 9న అందరూ థియేటర్లకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి" అని కోరారు.
యాక్టర్ నానాజీ కర్రి మాట్లాడుతూ.. "ఈ మూవీలో సెక్యూరిటీ రవి పాత్రలో కనిపించబోతున్నాను. నా కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ అవకాశంగా భావిస్తున్నాను. మయూఖగా పాయల్ పెర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తుంది" అని పేర్కొన్నారు.
నటుడు దేవ్ డి మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది, ప్రతీ సీన్ చాలా ఎంగేజింగ్‌గా కట్ చేశారు. ఈ సినిమాలో నేను ఎస్ఐ దేవ్‌గా చేశాను. మన డైరెక్టర్ మా అందరి నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఇలాంటి మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను" అని హర్షం వ్యక్తం చేశారు.
నటుడు రఘు వాసిరెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరూ చాలా ప్యాషన్‌తో వర్క్ చేశారు. ఈ కథలో ప్రతీ ఒక్కరూ హీరోనే, ప్రతీ ఒక్కరూ విలనే. ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది" అని తెలిపారు.
దసరా రేసులో మయూఖ.. నిర్మాత శశిధర్ నల్లా కాన్ఫిడెన్స్
{{/usCountry}}నటుడు రఘు వాసిరెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరూ చాలా ప్యాషన్‌తో వర్క్ చేశారు. ఈ కథలో ప్రతీ ఒక్కరూ హీరోనే, ప్రతీ ఒక్కరూ విలనే. ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది" అని తెలిపారు.
దసరా రేసులో మయూఖ.. నిర్మాత శశిధర్ నల్లా కాన్ఫిడెన్స్
{{/usCountry}}నిర్మాత శశిధర్ నల్లా మాట్లాడుతూ టీమ్ పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నారు. "మా ఈవెంట్‌కి వచ్చిన అందరికీ థాంక్స్. మయూఖ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ చూసి ఎంతగా ఎగ్జైట్ అయ్యారో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ ఇంప్రెస్ అవుతారు. ఈ సినిమా చూసిన తర్వాత పాయల్‌ని ప్రతీ ఒక్కరూ మయూఖ అనే పిలుస్తారు" అని ధీమా వ్యక్తం చేశారు.
పాయల్ ఈ సినిమా కోసం పగలు రాత్రి కష్టపడ్డారని చెప్పారు. డైరెక్టర్ శ్రీ తేజ్ ఏ టు జెడ్ బాధ్యత తీసుకుని వర్క్ చేశారని, మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారనే నమ్మకంతోనే దసరా హాలిడేస్ కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తెస్తున్నామని స్పష్టం చేశారు.
నరనరాన గుూస్‌బంప్స్ తెప్పిస్తుంది: పాయల్ చెంగప్ప
హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ.. "మయూఖ అనేది ఒక డిఫరెంట్ ఫిమేల్ సెంట్రిక్ థ్రిల్లర్. ఇప్పటి పరిస్థితుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. మా ప్రొడ్యూసర్ శశిధర్ గారికి ఆ ధైర్యం ఉంది" అని కొనియాడారు.
డైరెక్టర్ శ్రీ తేజ్ నాకు కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని, ఒక అమ్మాయి అనుకోని పరిస్థితులను ఎలా ఎదుర్కొంది అనేది చూస్తున్నప్పుడు గూస్‌బంప్స్ వస్తాయని ఆమె చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని స్పష్టం చేశారు.
యూఎస్ జాబ్ వదిలేసి.. హాలీవుడ్ స్టైల్ మేకింగ్
డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కే మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రయాణాన్ని పంచుకున్నారు. "మా పేరెంట్స్ నాపై ఉంచిన నమ్మకమే నన్ను ఈ రోజు ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. యూఎస్ లైఫ్‌ను వదిలేసి సినిమాల్లోకి వస్తానంటే ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోరు. కానీ వాళ్లు నన్ను నమ్మారు" అని ఎమోషనల్ అయ్యారు.
కథ చెప్పగానే పాయల్ వెంటనే ఓకే చెప్పారని, ప్రొడ్యూసర్ శశిధర్ నమ్మి డైరెక్టర్‌గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. తెలుగు సినిమాలో ఇలాంటి థ్రిల్లర్లు చాలా అరుదుగా వస్తాయని, హాలీవుడ్, కొరియన్ సినిమా స్టైల్‌లో కలర్ గ్రేడింగ్ చేశామని స్పష్టం చేశారు. అక్టోబర్ 9న థియేటర్లలో ప్రతీ ఒక్కరికీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు.
బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బార, జాను వర్మ, వీఎస్ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి షిబి మాథ్యూ అలెక్స్ సంగీతం అందించగా, ఫర్హాత్ వడక్కమ్ ఫొటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.