OTT Telugu: ఓటీటీలోకి ఈవారం ఓ తెలుగు మూవీ రెండు ఓటీటీల్లోకి ఒకే రోజు అడుగుపెడుతోంది. ఆ సినిమా పేరు హ్యాపీ జర్నీ. ఈ ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొదట కేవలం సన్ నెక్ట్స్ లోకి వస్తుందని భావించినా.. తాజాగా ఈటీవీ విన్ కూడా మూవీ స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది.
సన్‌నెక్ట్స్, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్

సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సన్ నెక్ట్స్’తో పాటు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’లలో ఈ సినిమా నవంబర్ 13 నుంచి అందుబాటులోకి రానుంది.
సన్‌నెక్ట్స్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లభ్యం కానుండగా, ఈటీవీ విన్‌లో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా అలరించనుంది.
హ్యాపీ జర్నీ స్టోరీ ఏంటంటే?
అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, యంగ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ సహా పలువురు కీలక పాత్రల్లో అలరించారు.
వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైనా బాదం), విహాన (రూప శ్రీనివాస్).. ఒక లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకుంటారు. గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ నిర్వాహకులు గోవింద్ (వంశీధర్ గౌడ్), అప్పారావు (రవి శివతేజ) వీరికి గైడ్లుగా వ్యవహరిస్తారు.
సరదాగా ప్రారంభమైన ఈ విహారయాత్ర సాగుతుండగానే ఆ మహిళల జీవితాల్లోని వ్యక్తిగత సమస్యలు, లోపల దాగి ఉన్న ఆవేదనలు బయటపడతాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలాంటి మలుపు తిరిగింది? ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఆయా కుటుంబాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది తెరపై చూడాల్సిందే.
వినోదం ఓకే.. ఎమోషన్‌లోనే లోటు
దర్శకుడు అభిరామ్ నాయుడు మంచి సందేశాత్మక కథనే ఎంచుకున్నారు. కథలోని అసలు ఆలోచన కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సరదా సన్నివేశాలు, వంశీధర్ నటన నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ఊహించని విధంగా ఉండి థ్రిల్ ఇస్తుంది.
{{/usCountry}}దర్శకుడు అభిరామ్ నాయుడు మంచి సందేశాత్మక కథనే ఎంచుకున్నారు. కథలోని అసలు ఆలోచన కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సరదా సన్నివేశాలు, వంశీధర్ నటన నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ఊహించని విధంగా ఉండి థ్రిల్ ఇస్తుంది.
{{/usCountry}}అయితే కథనాన్ని నడిపించిన తీరు కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. పాత్రల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని మరింత లోతుగా చూపించి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. ఒక్కొక్కరి సమస్యను వేగంగా పరిష్కరించేయడంతో ఎమోషన్స్ సరైన రీతిలో పండలేదు. కొన్ని సన్నివేశాలు పదే పదే వచ్చినట్లు అనిపిస్తాయి. హాస్యాన్ని, సెంటిమెంట్‌ను సమతుల్యం చేయడంలో కథనం తడబడింది.
ఈ సినిమాకు థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రెండు ఓటీటీల్లోకి రానుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. అందులోనూ సన్ నెక్ట్స్ లో ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటంతో సౌత్ ప్రేక్షకులు అందరి ఇళ్లలోకీ ఈ సినిమా చేరనుంది.