OTT Malayalam: ఓటీటీలోకి ఈవారం 3 క్రేజీ మలయాళం మూవీస్.. అన్నీ థ్రిల్లర్ సినిమాలే.. ఎక్కడ చూడాలంటే?
OTT Malayalam: ఈవారం ఓటీటీలోకి మూడు మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇవి 3 విభిన్నమైన క్రైమ్, డ్రామా, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు కావడం విశేషం. నవంబర్ 13న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్ (Netflix), జీ5 (ZEE5), మనోరమ మ్యాక్స్ (ManoramaMAX) లలో ఈ మూవీస్ రానున్నాయి.
OTT Malayalam: ఓటీటీ ప్రియులకు థ్రిల్లర్, సస్పెన్స్ కథాంశాలంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ ప్రధానంగా సాగే మలయాళ సినిమాలు, విభిన్నమైన కథనంతో వచ్చే చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై విశేష ఆదరణ పొందుతుంటాయి. ఈ క్రమంలో నవంబర్ 13న ఏకంగా మూడు క్రైమ్, సైకలాజికల్, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ వీక్షకులను అలరించడానికి క్యూ కట్టాయి. హిందీ, మలయాళ స్టార్ నటీనటులు నటించిన ఈ మూడు సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.

1. దాయరా (Daayra) – నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బాలీవుడ్ అగ్ర నటి కరీనా కపూర్ ఖాన్, మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన పవర్‌ఫుల్ డ్రామా థ్రిల్లర్ మూవీ 'దాయరా' (Daayra). 'రాజీ', 'సామ్ బహదూర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ సినిమాను రూపొందించారు.
వ్యవస్థలోని లోపాల వల్ల ఒక యువతి దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో కథ ప్రారంభమవుతుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఒక సీనియర్ పోలీస్ అధికారి తీసుకునే వివాదాస్పద నిర్ణయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది. విచారణ బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు అధికారులు జవాబుదారీతనం విషయంలో విభిన్న భావజాలాలతో తలపడటమే ఈ సినిమాలోని ప్రధాన సంఘర్షణ. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రగతి మిశ్రా, ప్రమోద్ సంఘీ, సుమాలి ఖానివాలే లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా.. నవంబర్ 13, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.
2. బాంద్రా (Bandra) – జీ5 (ZEE5)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మలయాళ నటుడు దిలీప్ జంటగా నటించిన భారీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘బాంద్రా’. అరుణ్ గోపి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో మంచి ఆదరణ పొంది ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
బాలీవుడ్‌లో దర్శకురాలిగా ఎదగాలని కలలుకనే 'సాక్షి' అనే యువతి, 1990ల కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి రహస్యంగా కనుమరుగైన నటి 'తారా జానకి' (తమన్నా) జీవితం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. తారా పాత సహచరుడు మిర్చీ సహాయంతో ఆమె గతాన్ని తవ్వడం ప్రారంభిస్తుంది.
ముంబై, కేరళ నేపథ్యాల్లో ఈ కథ సాగుతుంది. ఈ మూవీలో తమన్నా భాటియా, దిలీప్, డినో మోరియా, మమతా మోహన్‌దాస్, శరత్‌కుమార్, ఈశ్వరీ రావు, లీనా లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ నవంబర్ 13, 2026 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది.
3. ది థర్డ్ మర్డర్ (The Third Murder) – మనోరమ మ్యాక్స్ (ManoramaMAX)
సైజు కురుప్, వినయ్ ఫోర్ట్, ఇంద్రన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘ది థర్డ్ మర్డర్’. సునీల్ ఇబ్రహీం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వ్యాపారవేత్త బోబన్, పెడ్లర్ జస్టిన్ అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఒకే రీతిలో జరిగిన రెండు విచిత్రమైన సంఘటనల విచారణ బాధ్యతను పోలీస్ ఆఫీసర్ క్రిస్టీ, అతని బృందం స్వీకరిస్తుంది.
సీరియల్ నేరాల విచారణలో నిపుణుడైన మాజీ అధికారి 'స్వామి' సహాయంతో దర్యాప్తు వేగవంతం చేస్తారు. ఈ క్రమంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆదిత్య అనే టీనేజర్, అతని విచిత్రమైన తండ్రిపై అనుమానాలు వ్యక్తమవుతాయి. మూడో నేరం జరగకుండా అడ్డుకోవడానికి పోలీసులు సమయంతో పోటీపడుతూ ఆ మైండ్ గేమ్ మిస్టరీని ఎలా ఛేదించారనేది క్లైమాక్స్.
ఈ సినిమాలో సైజు కురుప్, ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్, అనన్య, లియోనా లిషాయ్, మణికందన్ పట్టాంబి నటించారు. నవంబర్ 13, 2026 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


