OTT Telugu: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి లేటెస్ట్ తెలుగు మూవీ.. ఈవారమే స్ట్రీమింగ్.. లక్కీ డ్రాలో యూరప్ ట్రిప్
OTT Telugu: యూరప్ ట్రిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హ్యాపీ జర్నీ' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో సీనియర్ నటీమణులు అన్నపూర్ణ, ఆమని, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి సన్‌నెక్ట్స్, ఈటీవీ విన్ లలో స్ట్రీమింగ్ కానుంది.
OTT Telugu: ఓటీటీలోకి ఈవారం ఓ తెలుగు మూవీ రెండు ఓటీటీల్లోకి ఒకే రోజు అడుగుపెడుతోంది. ఆ సినిమా పేరు హ్యాపీ జర్నీ. ఈ ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొదట కేవలం సన్ నెక్ట్స్ లోకి వస్తుందని భావించినా.. తాజాగా ఈటీవీ విన్ కూడా మూవీ స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది.

సన్‌నెక్ట్స్, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్
సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సన్ నెక్ట్స్’తో పాటు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’లలో ఈ సినిమా నవంబర్ 13 నుంచి అందుబాటులోకి రానుంది.
సన్‌నెక్ట్స్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లభ్యం కానుండగా, ఈటీవీ విన్‌లో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా అలరించనుంది.
హ్యాపీ జర్నీ స్టోరీ ఏంటంటే?
అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, యంగ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ సహా పలువురు కీలక పాత్రల్లో అలరించారు.
వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైనా బాదం), విహాన (రూప శ్రీనివాస్).. ఒక లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకుంటారు. గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ నిర్వాహకులు గోవింద్ (వంశీధర్ గౌడ్), అప్పారావు (రవి శివతేజ) వీరికి గైడ్లుగా వ్యవహరిస్తారు.
సరదాగా ప్రారంభమైన ఈ విహారయాత్ర సాగుతుండగానే ఆ మహిళల జీవితాల్లోని వ్యక్తిగత సమస్యలు, లోపల దాగి ఉన్న ఆవేదనలు బయటపడతాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలాంటి మలుపు తిరిగింది? ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఆయా కుటుంబాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది తెరపై చూడాల్సిందే.
వినోదం ఓకే.. ఎమోషన్‌లోనే లోటు
దర్శకుడు అభిరామ్ నాయుడు మంచి సందేశాత్మక కథనే ఎంచుకున్నారు. కథలోని అసలు ఆలోచన కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సరదా సన్నివేశాలు, వంశీధర్ నటన నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ఊహించని విధంగా ఉండి థ్రిల్ ఇస్తుంది.
అయితే కథనాన్ని నడిపించిన తీరు కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. పాత్రల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని మరింత లోతుగా చూపించి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. ఒక్కొక్కరి సమస్యను వేగంగా పరిష్కరించేయడంతో ఎమోషన్స్ సరైన రీతిలో పండలేదు. కొన్ని సన్నివేశాలు పదే పదే వచ్చినట్లు అనిపిస్తాయి. హాస్యాన్ని, సెంటిమెంట్‌ను సమతుల్యం చేయడంలో కథనం తడబడింది.
ఈ సినిమాకు థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రెండు ఓటీటీల్లోకి రానుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. అందులోనూ సన్ నెక్ట్స్ లో ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటంతో సౌత్ ప్రేక్షకులు అందరి ఇళ్లలోకీ ఈ సినిమా చేరనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


