...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో వచ్చిన ఐదు సినిమాలు- సైబర్ క్రైమ్, సైకలాజికల్, బోల్డ్ జోనర్లలో - ఎక్కడెక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగు భాషలో ఏకంగా ఐదు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలన్నీ క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ కోర్ట్ డ్రామా, సైకలాజికల్, డివోషనల్ యాక్షన్, బోల్డ్ రొమాంటిక్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాల, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 19, 2025, 20:00:06 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ప్రతివారం అన్ని భాషల్లో సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా ఈ వారం ఎన్నో సినిమాలు ఓటీటీరిలీజ్ కాగా వాటిలో ఇవాళ 15 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఐదు సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

మహావతార్ నరసింహా ఓటీటీ

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో వచ్చిన ఐదు సినిమాలు- సైబర్ క్రైమ్, సైకలాజికల్, బోల్డ్ జోనర్లలో - ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో వచ్చిన ఐదు సినిమాలు- సైబర్ క్రైమ్, సైకలాజికల్, బోల్డ్ జోనర్లలో - ఎక్కడెక్కడ చూడాలంటే?

హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి రూపొందిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం మహావతార్ నరసింహా. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు, నరసింహా స్వామి వంటి మైథలాజికల్ కాన్సెప్ట్‌పై తెరకెక్కిన మహావతార్ నరసింహా ఇండియా వైడ్‌గా బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది.

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది సత్తా చాటింది మహావతార్ నరసింహా. అలాంటి మహావతార్ నరసింహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (సెప్టెంబర్ 19) నెట్‌ఫ్లిక్స్‌లో మహావతార్ నరసింహా ఓటీటీ రిలీజ్ అయింది. కన్నడతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో అందుబాటులో ఉంది ఈ సూపర్ హిట్ సినిమా.

ది ట్రయల్ సీజన్ 2 ఓటీటీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్ ది ట్రయల్. 2023లో వచ్చిన ఈ సిరీస్ హిట్ కావడంతో సీక్వెల్‌గా సీజన్ 2ను తెరకెక్కించారు. జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టీ నుంచి ది ట్రయల్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ వంటి 7 భాషల్లో ది ట్రయల్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.

ది సర్ఫర్ ఓటీటీ

తమిళంలో సూపర్ హిట్ అయిన బోల్డ్ రొమాంటిక్ డ్రామా సిరీస్ ష్. తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ ష్ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి తెలుగు భాషలో ఆహాలో ష్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎఫైర్స్, శృంగారం వంటి అడల్ట్ కంటెంట్‌తో ఈ సిరీస్ సాగుతుంది.

ఐడీ: ది ఫేక్ ఓటీటీ

మలయాళంలో తెరకెక్కిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐడీ: ది ఫేక్. మాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ ద్యాన్ శ్రీనివాసన్, దివ్య పిల్లై, ఇంద్రాన్స్ నటించిన ఐడీ ది ఫేక్ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఐడీ ది ఫేక్ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe