తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ థియేటర్లలో రిలీజైన సుమారు మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే టీవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.
బ్యూటీ ఓటీటీ రిలీజ్ డేట్

గతేడాది సెప్టెంబర్ లో రిలీజైన తెలుగు రొమాంటిక్ మూవీ బ్యూటీ (Beauty). ఈ సినిమా శుక్రవారం (జనవరి 2) నుంచి జీ5 ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నిజానికి గతంలోనే ఈ సినిమా టీవీ ప్రీమియర్ అయింది. ఇప్పుడు మూడున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చింది. సాధారణంగా ప్రతి సినిమా మొదట ఓటీటీలోకి వచ్చిన తర్వాత టీవీలోకి అడుగుపెడుతుంది. కానీ ఈ బ్యూటీ మాత్రం రివర్సయింది.
బ్యూటీ మూవీ గురించి..
బ్యూటీ ఓ లోబడ్జెట్ రొమాంటిక్ డ్రామా. గతేడాది సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైనా.. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. అయితే రివ్యూలు మాత్రం బాగానే వచ్చాయి. ఐఎండీబీలోనూ 8.8 రేటింగ్ నమోదైంది. ఈ సినిమాలో సీనియర్ నటులు నరేష్, వాసుకితోపాటు అంకిత్, నీలఖిలాంటి కొత్త నటీనటులు నటించారు. జేఎస్ఎస్ వర్దన్ డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమా అలేఖ్య, అర్జున్ మధ్య జరిగే ప్రేమ.. అలేఖ్య కోసం ఆమె తండ్రి నారాయణ (నరేష్) చూపించే ప్రేమ చుట్టూ తిరుగుతుంది. కాలేజీలో చదివే అలేఖ్య.. ఓ పెట్ ట్రైనర్ అయిన అర్జున్ ప్రేమలో పడుతుంది. ఓ రోజు ఆమె కనిపించకుండాపోవడంతో నారాయణ తల్లడిల్లిపోతాడు. అర్జున్ తో వెళ్లిపోయిన అలేఖ్య చుట్టూ ఓ రౌడీ ముఠా కూడా పడుతుంది. అసలు వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అలేఖ్య కోసం నారాయణ ఏం చేశాడు? అలేఖ్య, అర్జున్ ప్రేమ సంగతి ఏమైందన్నది ఈ బ్యూటీ సినిమాలో చూడొచ్చు.
రొమాన్స్ కు కాస్త సస్పెన్స్ జోడించి వచ్చిన సినిమా ఇది. తమ పిల్లల కోసం పేరెంట్స్ ఎంత వరకూ వెళ్తారన్నది ఇందులో చూపించిన తీరు బాగుంది. తల్లిదండ్రులుగా నరేష్, వాసుకితోపాటు.. అంకిత్, నీలఖిల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ బ్యూటీ సినిమాను ఇప్పుడు జీ5 ఓటీటీలో చూడొచ్చు.
{{/usCountry}}రొమాన్స్ కు కాస్త సస్పెన్స్ జోడించి వచ్చిన సినిమా ఇది. తమ పిల్లల కోసం పేరెంట్స్ ఎంత వరకూ వెళ్తారన్నది ఇందులో చూపించిన తీరు బాగుంది. తల్లిదండ్రులుగా నరేష్, వాసుకితోపాటు.. అంకిత్, నీలఖిల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ బ్యూటీ సినిమాను ఇప్పుడు జీ5 ఓటీటీలో చూడొచ్చు.
{{/usCountry}}