OTT Telugu: ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఏకంగా 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు
OTT Telugu: ఓటీటీలోకి ఈమధ్యే అడుగుపెట్టిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నా వైఫ్ మిస్సింగ్ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా 100 మిలియన్ అంటే పది కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.
OTT Telugu: తెలుగు డిజిటల్ వినోద రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' తాజాగా తీసుకొచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నా వైఫ్ మిస్సింగ్. ఈ సినిమా వచ్చిన తొలి రోజు నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా తాజాగా మరో మైలురాయిని అందుకుంది.

తాజాగా ఈ ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ఏకంగా 100 మిలియన్లకు పైగా (100M+ Streaming Minutes) స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో జయకేతనం ఎగురవేసింది.
ఒక హిస్టారికల్ లవ్ స్టోరీ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా.. కథేంటంటే?
'ఒక హిస్టరీ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ నుంచి.. హెడ్‌లైన్స్‌లో నిలిచే సస్పెన్స్ థ్రిల్లర్ వరకు' అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో నా వైఫ్ మిస్సింగ్ మూవీ రికార్డును ఆహా ఓటీటీ షేర్ చేసింది. 2008లో వచ్చిన కొత్త బంగారం లోకంతో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఈ థ్రిల్లర్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతంగా, అందమైన ప్రేమకథతో ప్రారంభమయ్యే ఈ చిత్రం.. ఊహించని విధంగా హీరో భార్య అదృశ్యం కావడంతో ఒక్కసారిగా హై-వోల్టేజ్ మిస్టరీ డ్రామాగా రూపాంతరం చెందుతుంది.
అసలు ఆ భార్య ఏమైంది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఈ మిస్సింగ్ వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా? అనే ప్రశ్నల చుట్టూ కథనం వేగంగా పరుగులు తీస్తుంది. పోలీసుల విచారణ, అనుమానితుల జాబితా పెరుగుతుండటం, ప్రతీ సన్నివేశంలో ఎదురయ్యే ఊహించని మలుపులు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని అందిస్తాయి.
తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్ బ్రహ్మరథం
ఈ ‘ఆహా’ ఆరిజినల్ మూవీ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న థ్రిల్లర్ లవర్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇటీవలి కాలంలో ఓటీటీ వీక్షకులు రొటీన్ మాస్ ఎంటర్టైనర్ల కంటే మైండ్ గేమ్‌లు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారనేడానికి ‘నా వైఫ్ మిస్సింగ్’ సాధించిన ఈ 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ మైలురాయే నిదర్శనం. నటీనటుల నేచురల్ పెర్ఫార్మెన్స్, ఉత్కంఠభరితమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలబెట్టాయి.
వీకెండ్ లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే సినిమా ప్రేమికులకు ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న ‘నా వైఫ్ మిస్సింగ్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఈ రికార్డ్ బ్రేకింగ్ థ్రిల్లర్‌ను మిస్ అవ్వకుండా చేర్చేసుకోండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


