ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ప్రైమ్ వీడియోలో ఇండియాలోనే నంబర్ 1 ట్రెండింగ్.. మీరు చూశారా లేదా?

ఆది పినిశెట్టి నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో తొలి స్థానంలో ఉండటం విశేషం.

Published on: Jan 10, 2026, 11:16:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని సినిమాలు ఉంటాయి.. థియేటర్లలో ఎవరూ పట్టించుకోకపోయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అనూహ్యంగా దూసుకెళ్తుంటాయి. అలాంటిదే ఆది పినిశెట్టి లీడ్ రోల్లో నటించిన థ్రిల్లర్ మూవీ డ్రైవ్. ఇప్పుడీ సినిమాకు ప్రైమ్ వీడియోలో మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఆ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ప్రైమ్ వీడియోలో ఇండియాలోనే నంబర్ 1 ట్రెండింగ్.. మీరు చూశారా లేదా?
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ప్రైమ్ వీడియోలో ఇండియాలోనే నంబర్ 1 ట్రెండింగ్.. మీరు చూశారా లేదా?

ప్రైమ్ వీడియోలో డ్రైవ్ దూకుడు

ఆది పినిశెట్టి లీడ్ రోల్లో నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డ్రైవ్ (Drive). ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో ఉంది. ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటి నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇందులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ థామాను కూడా వెనక్కి నెట్టి ఈ డ్రైవ్ నంబర్ 1 స్థానంలోకి దూసుకెళ్లింది. విచిత్రమేమిటంటే అసలు ఈ సినిమాను థియేటర్లలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది.

డ్రైవ్ మూవీ కథేంటంటే?

జెనుసె మహమ్మద్ డైరెక్ట్ చేసిన సినిమా ఈ డ్రైవ్. గతేడాది డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. అదే సమయంలో రిలీజ్ కావాల్సిన అఖండ 2 వారం వాయిదా పడినా.. ఈ డ్రైవ్ మూవీ దానిని క్యాష్ చేసుకోలేకపోయింది. ఈ సినిమాలో జయదేవ్ రెడ్డి అనే పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు.

అతడో టీవీ ఛానెల్ ఓనర్. బయటి ప్రపంచానికి తెలియకుండా తన ఛానెల్ ను ఓ భారీ డీల్ కు అమ్మేయాలని ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఓ హ్యాకర్ అతన్ని టార్గెట్ చేసి ఆ విషయం లీక్ చేస్తాడు. అంతేకాదు జయదేవ్ ను, అతని సన్నిహితులను లక్ష్యంగా చేసుకొని చంపుతుంటాడు. అసలు ఆ హ్యాకర్ ఎవరు? ఎందుకలా చేస్తుంటాడు? జయదేవ్ తో ఉన్న శతృత్వం ఏంటన్నది ఇందులో చూడొచ్చు.

డ్రైవ్ ఎలా ఉందంటే?

డ్రైవ్ మూవీ సాధారణ తెలుగు సినిమాలకు భిన్నంగా కేవలం గంటా 45 నిమిషాల నిడివితో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇందులో లీడ్ రోల్ పోషించిన ఆది చాలా వరకు కారు డ్రైవింగ్ లోనే కనిపిస్తాడు. తాను పని చేసే చోటు నుంచి ఇంటికి వెళ్లేలోపు అతని జీవితం ఎలా తలకిందులైందనేది ఈ మూవీలో చూపించారు.

చివరి వరకూ సస్పెన్స్ కొనసాగించిన తీరు బాగుంది. క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ మరింత ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేయడం విశేషం. ఇప్పటి వరకూ మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More