ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు- ఆది పినిశెట్టి క్రైమ్ థ్రిల్లర్ నుంచి రోషన్ కనకాల లవ్ డ్రామా వరకు- ఓ లుక్కేయండి

ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. తెలుగు సినిమాలు కూడా భారీగానే రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ వారం ఓటీటీ సందడి అంతంతమాత్రంగానే ఉంది. మరి ఈ వీక్ ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలపై ఓ లుక్కేయండి. 

Published on: Jan 4, 2026, 21:49:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో కొత్త వారం సందడి కాస్త తగ్గింది. ముఖ్యంగా తెలుగులో పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన మొత్తం సినిమాలు కూడా తక్కువే. ఈ వీక్ లో ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఈ మూడు కాస్త స్పెషల్ గా ఉన్నాయి. మరి ఈ చిత్రాలు ఏంటో ఓ సారి చూసేయండి.

ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు

మోగ్లీ ఓటీటీ

సుమ కనకాల, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన సినిమా మోగ్లీ. హీరోగా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న రోషన్ చేసిన రెండో మూవీ ఇది. గతంలో బబుల్ గమ్ అని ఓ రొమాంటిక్ మూవీ చేశాడు. ఇప్పుడు మోగ్లీ అంటూ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుని హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మోగ్లీ స్టోరీ

రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటించిన మోగ్లీకి కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్టర్. అడవి బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ ఇది. ముర‌ళీ కృష్ణ‌ అలియాస్ మోగ్లీ (రోషన్) ఓ అనాథ. ఎస్సై కావాలనుకుంటాడు. ఊరి పక్కనే ఉన్న అడవిలో ఉంటాడు. షూటింగ్ ల కోసం వచ్చే సినిమావాళ్లకు హెల్ప్ చేసి డబ్బులు తీసుకుంటాడు. ఓ మూవీకి డ్యాన్సర్ గా వచ్చిన జాస్మిన్ (సాక్షి)ను చూసి లవ్ లో పడతాడు. కానీ మధ్యలో ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్) విలన్ లా వస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మూవీలో చూడాల్సిందే.

బ్యూటీ ఓటీటీ

టీవీలో వచ్చిన తర్వాత ఓటీటీలో అడుగుపెట్టిన తెలుగు రొమాంటిక్ మూవీ బ్యూటీ. ఇది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి కూడా ఒకరు. ఇందులో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకీ తదితరులు నటించారు.

క్యాబ్ డ్రైవర్ గా పని చేసుకునే ఓ తండ్రి తన కూతురిని ప్రాణంగా పెంచుకుంటాడు. కానీ పెట్ ట్రైనర్ గా పనిచేసే హీరోతో లవ్ లో పడి ఆమె వెళ్లిపోతుంది. మరోవైపు రౌడీ గ్యాంగ్ వీళ్ల వెంటపడుతుంది. మరి ఆ తండ్రి తన కూతురిని తిరిగి కలిశాడా? అన్నది బ్యూటీ స్టోరీ.

డ్రైవ్ ఓటీటీ

ఆది పినిశెట్టి లీడ్ రోల్ ప్లే చేసిన క్రైమ్ థ్రిల్లర్ డ్రైవ్. ఇది ప్రైమ్ వీడియోలో ఉంది. డ్రైవ్ మూవీలో ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజు తదితరులు నటించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. జయదేవ్ రెడ్డి (ఆది) ఓ మీడియా దిగ్గజం.

జయదేవ్ ఓ గ్రూప్ తో రహస్య ఒప్పందం చేసుకుని ఫ్యామిలీతో లండన్ వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ ఓ హ్యాకర్ ఇదంతా బయటపెడతాడు. మరి ఆ హ్యాకర్ ఎవరు? అనేది తెలియాలంటే డ్రైవ్ మూవీ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More