తెలుగులో టాప్ 10 సీరియల్స్ లిస్టు మరోసారి వచ్చేసింది. ఈ ఏడాది 47వ వారం రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఎప్పటిలాగే స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టాప్ 10లో చోటు సంపాదించినా.. ఈవారం వాటి స్థానాలు కాస్త అటూఇటూగా మారాయి. ఓవరాల్ గా కొన్ని సీరియల్స్ రేటింగ్స్ కూడా 47వ వారం కాస్త తగ్గాయి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా దూకుడు ఇప్పటిది కాదు. కొన్నేళ్లుగా ఆ ఛానెల్ సీరియల్సే టాప్ లో ఉంటూ వస్తున్నాయి. తాజా రేటింగ్స్ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు. కార్తీక దీపం 2 సీరియల్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. గత వారంతో పోలిస్తే రేటింగ్ కాస్త తగ్గి.. 15.68గా ఉంది. అంతేకాదు అటు అర్బన్, ఇటు రూరల్ రెండింట్లోనూ నంబర్ వన్ ఈ సీరియలే కావడం విశేషం.
రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా 14.08 రేటింగ్ నమోదైంది. మూడో స్థానంలోకి మరోసారి ఇంటింటి రామాయణం వచ్చింది. గుండె నిండా నిండా గుడి గంటలను వెనక్కి నెట్టి 13.45 రేటింగ్ తో ఉంది. ఇక 13.19 రేటింగ్ తో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది.
ఇక చిన్ని సీరియల్ 10.75 రేటింగ్ సాధించింది. ఇది 47వ వారం కూడా ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. ఇక మరో స్టార్ మా సీరియల్ నిండు మనసులు 8.61తో తన ఆరో స్థానాన్ని పదిలం చేసుకుంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లో చివరి నాలుగు స్థానాల్లో జీ తెలుగు సీరియల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో వచ్చే మేఘసందేశం సీరియల్ 8.29 రేటింగ్ తో ఓవరాల్ గా 7వ స్థానంలో నిలిచింది. ఇక చామంతి సీరియల్ 8.08 రేటింగ్ తో ఎనిమిదవ స్థానంలో ఉంది.
{{/usCountry}}టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లో చివరి నాలుగు స్థానాల్లో జీ తెలుగు సీరియల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో వచ్చే మేఘసందేశం సీరియల్ 8.29 రేటింగ్ తో ఓవరాల్ గా 7వ స్థానంలో నిలిచింది. ఇక చామంతి సీరియల్ 8.08 రేటింగ్ తో ఎనిమిదవ స్థానంలో ఉంది.
{{/usCountry}}జయం సీరియల్ 7.93, జగద్ధాత్రి 7.90తో 9, 10వ స్థానాల్లో నిలిచాయి. కొన్ని వారాలుగా టాప్ 10లో ఉంటూ వస్తున్న లక్ష్మీనివాసం సీరియల్ ఈసారి 11వ స్థానంతో సరిపెట్టుకుంది. 7.80 రేటింగ్ తో తృటిలో టాప్ 10లో స్థానం కోల్పోయింది.