Telugu Web Series: ఓటీటీలోకి ఆకలి రాజ్యం వెబ్ సిరీస్.. ముగ్గురు స్టూడెంట్స్, ఆశలను చిదిమేసిన వ్యవస్థ
Telugu Web Series: ఓటీటీలోకి ఆకలి రాజ్యం అనే వెబ్ సిరీస్ రాబోతోంది. నాలుగు దశాబ్దాల కిందట కమల్ హాసన్ కల్ట్ క్లాసిక్ మూవీ టైటిల్ తోనే ఆహా వీడియో ఓటీటీ ఈ సరికొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తుండటం విశేషం.
Telugu Web Series: ఆకలి రాజ్యం అనగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ నాలుగున్నర దశాబ్దాల కిందట కమల్ హాసన్, శ్రీదేవి నటించిన కల్ట్ క్లాసిక్ మూవీయే గుర్తుకు వస్తుంది. అప్పట్లో అంతటి సంచలనం సృష్టించిన సినిమా అది. ఇప్పుడదే టైటిల్ తో ఓటీటీలోకి ఓ వెబ్ సిరీస్ వస్తుండటం, ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ కావడం ఆసక్తి రేపుతోంది.

ప్రతి స్టూడెంట్, యూత్ స్టోరీ
ఈ ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ ను ఆహా వీడియో ఓటీటీ గత నెలలో తొలిసారి అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సిరీస్ కమింగ్ సూన్ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ స్టోరీ లైన్ ను రివీల్ చేసింది. “ముగ్గురు స్నేహితులు.. ఓ కుళ్లిపోయిన వ్యవస్థ.. వేయి కలలు.. ఓ స్టూడెంట్, యూత్, ఫ్రెండ్షిప్, తిరుగుబాటు కథ ఇది. ఆకలి రాజ్యం ఆహాలో కమింగ్ సూన్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అందులో ఈ సిరీస్ లోనూ ముగ్గురు లీడ్ క్యారెక్టర్లు తమ డిగ్రీ పట్టాలతో కనిపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది.
యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట
ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తూ గత నెల ఆహా ఓటీటీ రిలీజ్ చేసిన ప్రోమో కూడా ఆకట్టుకునేలా సాగింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివిన ప్రతి స్టూడెంట్ తర్వాత లక్ష్యం యూఎస్ఏ అంటూ ఈ ప్రోమో మొదలైంది. ఇక్కడ యూఎస్ఏ అంటే అమెరికా కాదు.. ఆ అమెరికా కలలను సాకారం చేసేందుకు తొలి అడుగు పడే యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట.
వచ్చిన ఉద్యోగంతో సర్దుకుపోయే వాళ్లు కొందరైతే.. నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లు మరికొందరు.. కథలు, కలలు, మనుషులు, ఎన్నో సంగతులు.. ఈ కథ మీదే కావచ్చు అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ కలలతో అమీర్‌పేట అక్కడి నుంచి అమెరికా వెళ్దామని కలలు కంటూ వచ్చే స్టూడెంట్స్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ లా ఈ ఆకలి రాజ్యం 2026 కనిపిస్తోంది.
ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్
ఈ ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ ఆకలి రాజ్యం 2026ను నీలగిరి మామిళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. “ఇది ఉద్యోగం కోసం ఇల్లు వదిలిన ప్రతి స్టూడెంట్ కోసం.. వీ విల్ గెట్ బ్యాక్ టు యు అని ముగిసే ప్రతి ఇంటర్వ్యూ కోసం.. కలలు, గౌరవం, విప్లవానికి చెందిన కథ.. ఆకలి రాజ్యం 2026 ఆహాలో కమింగ్ సూన్” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా ఆహా వీడియో ఓటీటీ వెల్లడించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


