Telugu Web Series: ఆకలి రాజ్యం 2026.. ఈ కథ మీదే కావచ్చు.. ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ చూడాల్సిన తెలుగు వెబ్ సిరీస్

Telugu Web Series: ఆహా వీడియో ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం కనే కలలు, అమీర్‌పేట వీధుల్లో వాళ్ల కష్టాలను చూపిస్తూ సాగే వెబ్ సిరీస్ ఇది.

Published on: Jul 7, 2026, 15:13:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Web Series: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియో ఇప్పుడు 'ఆకలి రాజ్యం 2026' పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. తాజాగా మంగళవారం (జులై 7) ఈ సిరీస్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేయకపోయినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ చూడాల్సిన కథగా రూపొందించినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

Telugu Web Series: ఆకలి రాజ్యం 2026.. ఈ కథ మీదే కావచ్చు.. ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ చూడాల్సిన తెలుగు వెబ్ సిరీస్
Telugu Web Series: ఆకలి రాజ్యం 2026.. ఈ కథ మీదే కావచ్చు.. ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ చూడాల్సిన తెలుగు వెబ్ సిరీస్

ఆకలి రాజ్యం 2026 ప్రోమో

ఆకలి రాజ్యం సినిమా గుర్తుందా? అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట వచ్చిన మూవీ. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి ఉద్యోగాలు దొరక్క కష్టాలు పడే కొందరు యువకుల చుట్టూ తిరిగే కథ అది. కమల్ హాసన్, శ్రీదేవి జీవించేశారు. ఇప్పుడదే టైటిల్ తో ఆహా వీడియో ఓటీటీ ఓ కొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. ఆకలి రాజ్యం 2026 అంటూ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే తెలుస్తోంది.

యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట

ఈ ఆకలి రాజ్యం 2026 వెబ్ సిరీస్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివిన ప్రతి స్టూడెంట్ తర్వాత లక్ష్యం యూఎస్ఏ అంటూ ఈ ప్రోమో మొదలవుతుంది. ఇక్కడ యూఎస్ఏ అంటే అమెరికా కాదు.. ఆ అమెరికా కలలను సాకారం చేసేందుకు తొలి అడుగు పడే యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట.

వచ్చిన ఉద్యోగంతో సర్దుకుపోయే వాళ్లు కొందరైతే.. నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లు మరికొందరు.. కథలు, కలలు, మనుషులు, ఎన్నో సంగతులు.. ఈ కథ మీదే కావచ్చు అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ కలలతో అమీర్‌పేట అక్కడి నుంచి అమెరికా వెళ్దామని కలలు కంటూ వచ్చే స్టూడెంట్స్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ లా ఈ ఆకలి రాజ్యం 2026 కనిపిస్తోంది.

ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్

ఈ ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ ఆకలి రాజ్యం 2026ను నీలగిరి మామిళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. “ఇది ఉద్యోగం కోసం ఇల్లు వదిలిన ప్రతి స్టూడెంట్ కోసం.. వీ విల్ గెట్ బ్యాక్ టు యు అని ముగిసే ప్రతి ఇంటర్వ్యూ కోసం.. కలలు, గౌరవం, విప్లవానికి చెందిన కథ.. ఆకలి రాజ్యం 2026 ఆహాలో కమింగ్ సూన్” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా ఆహా వీడియో ఓటీటీ వెల్లడించే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More