Vijay: సీఎంగా విజయ్.. బిగ్ ట్విస్ట్.. షాకిచ్చిన గవర్నర్.. రేపు ప్రమాణ స్వీకారం లేనట్లే.. రిసార్ట్ లోనే ఎమ్మెల్యేలు!
Vijay: సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టే దిశగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేరే లెవల్ డ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం రేపు (మే 7) లేదని తెలిసింది.
Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘విజయ్ అనే నేను’ అంటూ దళపతి విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంకా వెయిట్ చేయక తప్పేలా లేదు. రేపు జరగాల్సిన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రద్దయినట్లు తెలిసింది.

సీఎంగా రేపే
దళపతి విజయ్ రేపే (మే 7) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రేపు జరగాల్సిన ఈ ఈవెంట్ వాయిదా పడ్డట్లు తెలిసింది.
గవర్నర్ షాక్
తమిళనాడులో అధికారం చేపట్టడం కోసం అవసరమైన మెజారిటీ కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు విజయ్. అయితే మ్యాజిక్ నంబర్ రీచ్ కాకపోవడంతో విజయ్ కు గవర్నర్ షాకిచ్చారని తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ ఒప్పుకోలేదని సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవం రద్దు అయిందని తెలిసింది. అలాగే టీవీకే ఎమ్మెల్యేలను కూడా రీసార్ట్ లోనే ఉండాలని విజయ్ ఆదేశించినట్లు సమాచారం.
మెజారిటీ కోసం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు విజయ్. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారంలోకి రావాలంటే 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి. ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన అయిదుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ తో టీవీకే సపోర్ట్ 113 కు చేరింది. ఆ పార్టీకి ఇంకా అయిదుగురి ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి.
టైమ్ గడుస్తున్నా
అధికారం కోసం అవసరమైన 118 సభ్యుల మద్దతును విజయ్ ఇంకా దక్కించుకోలేకపోయాడు. అందుకే రేపు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం లేదని తెలిసింది. విజయ్ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూనే ఉన్నాడని తెలిసింది. మెజారిటీ దక్కిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
డీఎంకే ఫైర్
మరోవైపు టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్ చేయడంపై డీఎంకే ఫైర్ అయింది. అంతే కాకుండా డీఎంకే. ఏఐఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే సంచలనమే అని చెప్పాలి. అయితే మరోవైపు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకే రెడీగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే మార్టిన్ వెల్లడించారు.
క్లారిటీ వచ్చేనా?
ఇలా తమిళనాడు రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మెజారిటీ కోసం విజయ్ తెగ ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు అనూహ్యమైన కూటములు ఏమైనా ఏర్పడతాయా? అనే ఆసక్తి కూడా నెలకొంది. ఈ క్రమంలో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టే విషయంపై రేపు క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


