Tharun Bhascker: అఫీషియల్..ఆ హీరోయిన్ నా కొడుకుకి సోల్ మేట్..తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా బంధంపై తల్లి గీత ఎమోషనల్ కామెంట్స్
Tharun Bhascker Mother: తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా రిలేషన్ షిప్ పై తరుణ్ భాస్కర్ వాళ్లమ్మ గీత ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తరుణ్ కు సోల్ మేట్ లా ఈషా దొరికిందని గీత చెప్పారు. ఈ నగరానికి ఏమైంది 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Tharun Bhascker Mother: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌పై తరుణ్ తల్లి, నటి గీత భాస్కర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'ఈ నగరానికి ఏమైంది 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె భావోద్వేగానికి గురవుతూ.. ఈషా తన కొడుక్కి దొరికిన అద్భుతమైన సోల్ మేట్ అని ప్రశంసించారు. దీంతో వీరి బంధంపై వస్తున్న వార్తలకు అధికారికంగా ముద్ర పడినట్లయింది.

హాట్ టాపిక్‌గా తరుణ్, ఈషా
'పెళ్లి చూపులు' సినిమాతో తెలుగులో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అతను నటుడిగానూ తనదైన ముద్ర వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అటు అందం, అభినయంతో మెప్పిస్తూ వస్తున్న అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని, ఇద్దరూ డీప్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.
వినాయకచవితి రోజు తరుణ్, ఈషా కలిసి పూజ చేయడంతో వీళ్ల బంధం కన్ఫామ్ అయిందనే టాక్ వినిపించింది. అయితే ఈ రూమర్స్‌పై తరుణ్ గానీ, ఈషా గానీ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా తరుణ్ భాస్కర్ తల్లి గీత చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
'ఈ నగరానికి ఏమైంది 2' ఈవెంట్‌లో
యూత్ లో కల్ట్ స్టేటస్ సంపాదించుకున్న 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ఈ నగరానికి ఏమైంది 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు తరుణ్ తల్లి గీత భాస్కర్ (ఫిదా మూవీ ఫేమ్) కూడా హాజరయ్యారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తన కొడుకు సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అతని వ్యక్తిగత జీవితం గురించి ఎమోషనల్ అయ్యారు. ఇదే సమయంలో ఈషా రెబ్బా గురించి ఆమె చేసిన కామెంట్స్ ఈవెంట్ కే హైలైట్‌గా నిలిచాయి.
సోల్ మేట్ ఆమెనే!
స్టేజ్ పై గీత భాస్కర్ మాట్లాడుతూ.. "తరుణ్ చాలా ఎమోషనల్ పర్సన్. ఈ రెండేళ్లు చాలా ఇబ్బందులు పడ్డాడు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రాత్రి 2 గంటలు, 4 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు, తినాలనప్పుడు ఈషా తోడుగా నిలిచింది. నాకు ఓ ధైర్యం. నా వయసైపోతుంది. ఎవరైనా నా కొడుక్కి సపోర్ట్ గా ఉండాలనుకున్నా.
ఫ్రెండ్స్ తో అన్ని చెప్పుకోలేం. ఓ పార్ట్ నర్ కావాలి. సోల్ మేట్ కావాలి. నాకెంతో సంతోషంగా ఉంది. థాంక్యూ ఈషా. నా కొడుక్కి సపోర్ట్ గా నిలిచింది. ఆమె సోల్ మేట్’’ అని గీత చెప్పారు.
వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గీత భాస్కర్ మాట్లాడిన వీడియో క్లిప్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ జంట చాలా క్యూట్‌గా ఉందని, త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక తల్లి తన కొడుకు రిలేషన్‌ను ఇంత ఓపెన్‌గా, ఇంత అందంగా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై అంగీకరించడం నిజంగా గ్రేట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


