ENE Repeat Trailer: ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ రిలీజ్- మారిన కార్తీక్ పాత్ర- ఆకట్టుకుంటున్న హీరో శ్రీనాథ్ మాగంటి!
Vishwak Sen Ee Nagaraniki Emaindi 2 Trailer Srinath Maganti: యువతను విపరీతంగా ఆకట్టుకున్న 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ విడుదలైంది. ఇందులో 'కార్తీక్' పాత్రలో హీరో శ్రీనాథ్ మాగంటి అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అలరించారు. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
Vishwak Sen Ee Nagaraniki Emaindi 2 Trailer Srinath Maganti: తెలుగు ప్రేక్షకుల్లో, ప్రత్యేకించి యూత్‌లో ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్నేహం, మద్యం, కలలు, హ్యూమర్ కలగలిపిన ఆ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ స్పేస్‌లోనూ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ రిలీజ్
ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE 2). ఈఎన్ఈ 2 విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రచార వేగాన్ని పెంచారు. నవంబర్ 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 3) అంటే ఇవాళ విడుదల చేశారు.
ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ చూస్తుంటే ఆనాటి నవ్వుల ప్రయాణం మళ్లీ కళ్లముందు సాగుతున్న అనుభూతి కలుగుతోంది. నలుగురు స్నేహితుల గ్యాంగ్ చుట్టూ తిరిగే కథలో ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆ నలుగురి టీమ్‌లో సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో మ్యాన్షన్ హౌజ్ మల్లేష్ మూవీ హీరో శ్రీనాథ్ మాగంటి (యానిమల్ ఫేమ్) అడుగుపెట్టారు. కార్తీక్ అనే కీలకమైన పాత్రలో ఆయన నటించారు.
గ్యాంగ్‌లో కొత్తగా చేరిన శ్రీనాథ్.. టైమింగ్ మామూలుగా లేదు!
సెంటిమెంట్, కామెడీ కలగలిసి సాగే ఈ సిరీస్‌లో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఎప్పటిలాగే తమ మార్కు టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఆడియన్స్ మనసులో ఇప్పటికే గట్టిగా రిజిస్టర్ అయిన ఒక హిట్ గ్యాంగ్‌లోకి వెళ్లి మెప్పించడం సాధారణ విషయం కాదు.
నటుడు శ్రీనాథ్ మాగంటి ఈ సవాలును చాలా నైపుణ్యంతో స్వీకరించారు. ఈఎన్ఈ 2 ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు, సంభాషణలు చెప్పిన విధానం చూస్తే ఆయన కార్తీక్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయినట్లు తెలుస్తోంది.
నలుగురు స్నేహితుల బంధంలో ఎక్కడా వ్యత్యాసం కనిపించకుండా, మొదటి నుంచి ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యుడిలాగే ఆయన కలిసిపోయారు. శ్రీనాథ్ కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్, స్టైలిష్ లుక్ నవతరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
అభిరుచి - ఉద్యోగం మధ్య ఘర్షణ: ఆకట్టుకుంటున్న పాత్ర పరిణితి
ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ ఆధారంగా చూస్తే.. కార్తీక్ పాత్ర ఒక సగటు పట్టణ యువకుడి ఆలోచనలకు అద్దం పట్టేలా ఉంది. సాంప్రదాయ పద్ధతిలో కార్పొరేట్ ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడాలా? లేక తన మనసుకు నచ్చిన అభిరుచి (పాషన్) వైపు అడుగులు వేయాలా? అనే ఆందోళన మధ్య నలిగిపోయే పాత్ర ఇది.
ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలను భరిస్తూనే, మరోవైపు స్నేహితులతో కలిసి అల్లరి చేసే స్వేచ్ఛాయుతమైన వైఖరిని ప్రదర్శించడం ఈ పాత్ర ప్రత్యేకత. ఈ రెండు వైరుధ్యాలను సమతుల్యం చేస్తూ శ్రీనాథ్ కనబరిచిన నటన సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పాత్రలోని అంతర్మథనాన్ని, భావోద్వేగాలను ఆయన చాలా సహజంగా తెరపైకి తీసుకొచ్చారని ట్రైలర్ నిరూపిస్తోంది.
శ్రీనాథ్ సినిమాలు
శ్రీనాథ్ మాగంటి యానిమల్ సినిమాలో రష్మిక మందన్నాకు సోదరుడిగా నటించి మెప్పించారు. అలాగే లక్కీ భాస్కర్ లో కీలక పాత్ర పోషించారు. మ్యాన్షన్ హౌజ్ మల్లేష్ సినిమాలో హీరోగా కూడా చేసి ఆకట్టుకున్నారు. బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్, హిట్ ది ఫస్ట్ కేస్, కమిట్‌మెంట్, ఇదేం దెయ్యం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చాలా సినిమాల్లో అలరించారు శ్రీనాథ్ మాగంటి.
నవంబర్ 19న గ్రాండ్ రిలీజ్
యూత్ ఫుల్ హ్యూమర్, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ మళ్లీ రిపీట్ కాబోతున్నాయని ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొదటి భాగం తెచ్చిన క్రేజ్ దృష్ట్యా ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనాథ్ మాగంటి రాక సినిమాకు కొత్త ఫ్రెష్‌నెస్‌ను తెచ్చిపెట్టింది. నవంబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


