Adarsha Kutumbam OTT Cult OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన వెంకటేష్ ఆదర్శ కుటుంబం, విశ్వక్ సేన్ కల్ట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Aadarsha Kutumbam OTT Cult OTT: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబంతో పాటు విశ్వక్‌సేన్ కల్ట్ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ రైట్స్ ధరలు ఖరారయ్యాయి. ఈ సినిమాల బడ్జెట్, ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూద్దాం.
Venkatesh Aadarsha Kutumbam OTT Vishwak Sen #Cult OTT: నిన్న (అక్టోబర్ 30) థియేటర్లలో విడుదలైన రెండు క్రేజీ సినిమాల ఓటీటీ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఒకటి విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' కాగా మరోటి విశ్వక్ సేన్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన సినిమా #కల్ట్.

భారీ బడ్జెట్.. రూ. 70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్!
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన 'ఆదర్శ కుటుంబం హౌజ్ నెం 47' చిత్రాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రొడక్షన్ ఖర్చులు, పబ్లిసిటీతో కలిపి దాదాపు రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తీశారు.
వెంకటేష్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అలరించగా, నారా రోహిత్, నివేదా పెతురాజ్, యువీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ వంటి పెద్ద తారాగణం కీలక పాత్రల్లో కనిపించారు. థమన్ సంగీతం అందించగా, రవి కే చంద్రన్ ఛాయాగ్రహణం సమకూర్చారు.
ఆదర్శ కుటుంబం లాభాల్లోకి రావాలంటే
ఆదర్శ కుటుంబం సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధర పలికాయి. నైజాం హక్కులు రూ. 25 కోట్లు, ఆంధ్రా హక్కులు రూ. 18 కోట్లు, సీడెడ్ రూ. 8 కోట్లు వసూలు చేశాయి. కర్ణాటక, తమిళనాడు హక్కులు రూ. 2 కోట్లు, మిగతా భారతదేశం రూ. 4 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 8 కోట్లు చొప్పున మొత్తంగా రూ. 65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబం లాభాల్లోకి రావాలంటే రూ. 70 కోట్ల షేర్, రూ. 140 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది.
ఏకంగా రూ. 40 కోట్ల డీల్!
'ఆదర్శ కుటుంబం' ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో శాటిలైట్ హక్కులు రూ. 18 కోట్లు, మ్యూజిక్ హక్కులు రూ. 6 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కులు రూ. 6 కోట్లు పలికాయి. ఇలా కేవలం నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఈ సినిమా రూ. 70 కోట్లు రాబట్టింది.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఆదర్శ కుటుంబం సినిమాను ఓటీటీలో ప్రసారం చేయాలనే నిబంధనపై నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. ఈ లెక్కన నవంబర్ చివరి వారంలో ఆదర్శ కుటుంబం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్ల రన్‌ను బట్టి ఈ తేదీ మారే వెసులుబాటు కూడా ఉంది. ఆ సమయంలో ఓటీటీ రిలీజ్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేస్తుంది.
అమెజాన్ ప్రైమ్‌లో విశ్వక్‌సేన్ 'కల్ట్'
మరోవైపు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన స్లాషర్ యాక్షన్ థ్రిల్లర్ 'కల్ట్' చిత్రం ఓటీటీ రిలీజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఓటీటీ రూపంలో రూ. 6 కోట్లు రాగా, థియేటర్ల ద్వారా మరో రూ. 10 కోట్లు రావాల్సి ఉంది.
డబ్బింగ్ హక్కులు ఇంకా సేల్ కాకపోవడంతో దాదాపు రూ. 9 కోట్ల డెఫిసిట్‌తో ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం గమనార్హం. నవంబర్ చివరి వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లో #కల్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


