#Cult Trailer: మోడీ కంటే మొండోడు సర్- రక్తపాతం, కామెడీతో విశ్వక్ సేన్ #కల్ట్ ట్రైలర్ రిలీజ్- గోవాలో మరణమృదంగం

Vishwak Sen #Cult Trailer Released: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన స్లాషర్ థ్రిల్లర్ '#కల్ట్' ట్రైలర్ ఇవాళ విడుదలైంది. గోవాలోని ఒక దీవిలో చిక్కుకున్న 300 మంది ప్రాణాల కోసం ఆడే భయంకరమైన ఆట నేపథ్యంతో కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా చూపించారు.

Published on: Oct 18, 2026, 21:19:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vishwak Sen #Cult Trailer Released: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తన విభిన్నమైన మేకింగ్ శైలితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, కథ అందించి, హీరోగా నటించిన సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ చిత్రం '#CULT' (కల్ట్).

మోడీ కంటే మొండోడు సర్- రక్తపాతం, కామెడీతో విశ్వక్ సేన్ #కల్ట్ ట్రైలర్ రిలీజ్- గోవాలో మరణమృదంగం
మోడీ కంటే మొండోడు సర్- రక్తపాతం, కామెడీతో విశ్వక్ సేన్ #కల్ట్ ట్రైలర్ రిలీజ్- గోవాలో మరణమృదంగం

#కల్ట్ ట్రైలర్ రిలీజ్

తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మించిన #కల్ట్ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. మొదటి సన్నివేశం నుంచే తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ #కల్ట్ ట్రైలర్, సోషల్ మీడియా వేదికలపై తెగ హల్‌చల్ చేస్తోంది.

గతంలో 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' చిత్రాలతో స్వీయ దర్శకత్వంలో తన సత్తా నిరూపించుకున్న విశ్వక్ సేన్, ఈసారి తెలుగుతెరకు కాస్త కొత్తదైన 'స్లాషర్ థ్రిల్లర్' జోనర్‌ను ఎంచుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, కథనంపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకవైపు వయోలెంట్ యాక్షన్, మరోవైపు వినోదం జోడిస్తూనే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా కథను మలిచిన తీరు ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

గోవా దీవిలో మరణ మృదంగం

#కల్ట్ ట్రైలర్ విషయానికొస్తే.. గోవాలోని ఒక ద్వీపంలో ఉన్న విలాసవంతమైన భవంతిలో ఈ కథ నడుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో డీఎస్పీ సంకల్ప్ నాయక్‌తో పాటు సుమారు 300 మందికి పైగా జనం ఓ బిల్డింగ్‌లో చిక్కుకుపోతారు. అక్కడ నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గం ఉండదు. బతకాలి అంటే అక్కడ నిర్వహించే భయంకరమైన ప్రాణాంతకమైన ఆటల్లో పాల్గొనక తప్పదు.

చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. అడుగడుగునా సాగే మరణ మృదంగం మధ్య తమను తాము కాపాడుకోవడానికి వారు చేసే జీవన్మరణ పోరాటంగా #కల్ట్ ట్రైలర్‌ను రూపొందించారు. స్క్విడ్ గేమ్ తరహాలో ఓ గేమ్ ఆడాలని, లేకుంటే చస్తారని ఓ కార్టూన్ బొమ్మతో చెప్పించారు. అనంతరం ఒకరినొకరు చంపుకోవడం, విలన్స్‌ను అతి క్రూరంగా విశ్వక్ చంపడం సీన్లు అదిరిపోయాయి.

డ్రగ్స్ అంటే పడని ఖాకీ.. 'సంకల్ప్ నాయక్' గా విశ్వక్ విశ్వరూపం

ఈ సినిమాలో విశ్వక్ సేన్ 'డీఎస్పీ సంకల్ప్ నాయక్' అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. డ్రగ్స్ ముఠాల పట్ల అస్సలు కనికరం లేని అధికారిగా, అత్యంత అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో విశ్వక్ సరికొత్త అవతారంలో మెరిశాడు. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తనదైన మాస్ డైలాగ్ డెలివరీ, టైమింగ్ కామెడీతో పాత్రకు జీవం పోశాడు.

విశ్వక్ గెటప్, సంభాషణలు మాస్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా విశ్వక్ గురించి శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే.. "వాడు మోడీ కంటే మొండోడు సర్.. పెట్రోల్, డీజిల్ రెండు కలిపి తగలబెడతాడు" అనై డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.

భారీ తారాగణం, సాంకేతిక నిపుణుల బలం

కాగా, #కల్ట్ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ప్రతి పాత్రకూ కథలో ప్రాధాన్యం ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సాంకేతిక విభాగంలో అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. విజువల్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి.

అందుకు తగినట్లుగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్ సీన్లకు రవి బస్రూర్ బీజీఎమ్ నెక్ట్ లెవెల్ హై ఇచ్చేలా ఉంది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా #కల్ట్ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More