Rashmika Mysaa Movie: పుష్ప 2 బుగ్గారెడ్డితో శ్రీవల్లి ఫైట్! రష్మిక మైసాలో విలన్‌గా తారక్ పొన్నప్ప.. అతనే ఎందుకంటే?

Rashmika Mysaa Movie: పుష్ప 2 మూవీలో సైకోయిజం, రౌడీయిజంతో అదరగొట్టిన విలన్ తారక్ పొన్నప్ప.. ఇప్పుడు రష్మిక మందన్నను ఢీ కొడుతున్నాడు. నేషనల్ క్రష్ అప్ కమింగ్ మూవీ ‘మైసా’లో తారక్ విలన్ గా నటిస్తున్నాడు. మరి అతడినే ఎందుకు విలన్ గా తీసుకున్నారా? దీని వెనుక ఉన్న స్ట్రాటెజీ ఏంటో చూసేయండి.

Published on: Jun 9, 2026, 08:37:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rashmika Mysaa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో కొగటం బుగ్గారెడ్డి పాత్రతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ నటుడు తారక్ పొన్నప్ప గుర్తున్నాడా? ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa) లో అతను మెయిన్ విలన్‌గా మారాడు. శ్రీవల్లితో పోరాటానికి సిద్ధమయ్యాడు.

రష్మిక మందన్న మైసాలో విలన్ గా తారక్ పొన్నప్ప (x)
రష్మిక మందన్న మైసాలో విలన్ గా తారక్ పొన్నప్ప (x)

మైసాలో ఈరగా

రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘మైసా’ మూవీలో తారక్ పొన్నప్ప పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తారక్ పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేశారు. మైసాలో ‘ఈర’ అనే విలన్ గా భీకరమైన క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, ఈ కాస్టింగ్ వెనుక టాలీవుడ్ ట్రేడ్ లెక్కలు, ‘పుష్ప’ కనెక్షన్ ఊహించని రేంజ్‌లో ఉన్నాయి.

'శ్రీవల్లి' వర్సెస్ ‘బుగ్గిరెడ్డి’

సాధారణంగా ఒక సినిమా అప్‌డేట్ వస్తే "ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది" అని సరిపెట్టేస్తుంటారు. కానీ, 'మైసా' చిత్రంలో తారక్ పొన్నప్పను విలన్‌గా ఎంచుకోవడం వెనుక దర్శకుడు రవీంద్ర పుల్లె ఒక బలమైన కమర్షియల్ స్ట్రాటజీని ఉపయోగించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఎమోషనల్ కనెక్ట్: ‘పుష్ప 2’లో రష్మిక (శ్రీవల్లి) పాత్రను, అల్లు అర్జున్ సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెట్టే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ పొన్నప్ప మెరిశాడు. ఇప్పుడు రష్మిక లీడ్ రోల్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ రా యాక్షన్ ఫిల్మ్‌లో ఆయనే మెయిన్ విలన్ కావడం విశేషం.
  • ఆడియన్స్ పల్స్: పుష్ప-2 చూసిన ప్రేక్షకులకు బుగ్గారెడ్డి క్రూరత్వంపై ఇప్పటికే ఒక స్పష్టమైన ముద్ర పడింది. కాబట్టి ‘మైసా’ సినిమాలో విలన్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడికి ఎక్కువ సమయం పట్టదు. థియేటర్‌లోకి రాగానే ఆడియన్స్ ఈ ఇద్దరి మధ్య మైండ్ గేమ్‌ను ఈజీగా ఓన్ చేసుకుంటారు.
  • ట్రేడ్ టాక్: ప్రస్తుతం టాలీవుడ్‌లో కన్నడ, మలయాళ నటులను విలన్లుగా పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. కేజీఎఫ్, దేవర, పుష్ప 2 చిత్రాలతో తారక్ పొన్నప్పకు పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ సినిమాకు ఇతని క్రేజ్ కూడా కలిస్తే నార్త్ బెల్ట్‌లో కూడా బిజినెస్ పరంగా భారీగా హెల్ప్ అవుతుంది.

పుష్ప 2లో అదుర్స్

తారక్ పొన్నప్ప కెరీర్‌ను 'పుష్ప 2' పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో దాదాపు సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం తన బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ కళ్లతోనే భయాన్ని పుట్టించాడు తారక్. కొన్ని సీన్లలో మెయిన్ విలన్ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) పాత్ర కంటే కూడా బుగ్గారెడ్డి క్యారెక్టరైజేషన్ థియేటర్లలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది.

ఇప్పుడు 'మైసా' చిత్రంలో లూంగీ, నల్ల చొక్కా ధరించి, చేతిలో పాతకాలపు టెలిఫోన్ పట్టుకుని వెనుక కాగడాల కాంతిలో నిలబడిన ‘ఈర’ లుక్ చూస్తుంటే.. ఈసారి రష్మికకు వెండితెరపై నరకం చూపించే విలన్‌గా తారక్ నటించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

'మైసా' మూవీ గురించి..

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న మైసా చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక పక్కా రా అండ్ రస్టిక్ ట్రైబల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో గిరిజన ప్రాంతాల నేపథ్యంలో, కల్చరల్ ఎలిమెంట్స్‌తో వచ్చే యాక్షన్ సినిమాలకు (ఉదాహరణకు కాంతార, పుష్ప) విపరీతమైన డిమాండ్ ఉంది. 2026లో భారీ అంచనాలతో రాబోతున్న ఈ మైసా చిత్రంపై రష్మిక కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో కూడిన సోలో ప్రాజెక్ట్‌గా ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది.

People Also Ask (PAA)

1. పుష్ప 2లో తారక్ పొన్నప్ప పాత్ర ఏంటి?

జవాబు: తారక్ పొన్నప్ప 'పుష్ప 2: ది రూల్' సినిమాలో కొగటం బుగ్గారెడ్డి అనే పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో నటించాడు. సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఇతని క్యారెక్టర్ బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌ క్రియేట్ చేసింది.

2. మైసాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుందా?

జవాబు: 'మైసా' చిత్రం గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ డ్రామా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సినిమా సెన్సార్ పూర్తయిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.

3. మైసా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

జవాబు: రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా' చిత్రాన్ని 2026 లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అధికారిక తేదీ ఖరారు కావాల్సి ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More