Netflix: ఓటీటీలో ఆ ఫార్ములా చెల్లదు, అసలైన హిట్ వ్యూస్ కాదు, అవే క్రైమ్ థ్రిల్లర్స్ 20 వచ్చాయి: నెట్‌ఫ్లిక్స్ డైరెక్టర్
Netflix India Director Ruchikaa Kapoor Sheikh About OTT Trends: సినిమా ప్రమోషన్ల శైలితో పాటు ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ షేక్ తెలిపారు. కేవలం వ్యూస్‌తో మాత్రమే ఓటీటీ సినిమాలను హిట్‌గా చెప్పలేమని ఆమె వెల్లడించారు.
Netflix India Director Ruchikaa Kapoor Sheikh About OTT Trends: డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక భారతీయ సినిమా రూపురేఖలే మారిపోయాయి. థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు సాధించే కలెక్షన్ల లెక్కలకు భిన్నంగా ఓటీటీలో కంటెంట్ మాత్రమే రాజాని నిరూపిస్తోంది. మన తెలుగు ప్రేక్షకులు కూడా థ్రిల్లర్లు, కొత్త తరహా కథాంశాలను ఓటీటీల్లో ఆదరించడంలో ముందంజలో ఉన్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా డైరెక్టర్
ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ షేక్ నెట్‌ఫ్లిక్స్ సాధించిన విజయాలు, మారిన ప్రమోషన్ల శైలి, అసలైన హిట్ అంటే ఏంటి అనే అంశాలపై కీలక విశేషాలు పంచుకున్నారు.
ఆశ్చర్యపరిచిన ప్రయాణం
డిజిటల్ మీడియాలో సినిమాల విజయాల సరళి గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని రుచికా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు మాత్రమే సంచలనం సృష్టించేవని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని తెలిపారు.
"చిన్న సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 'అక్యూజ్డ్' అనే చిన్న చిత్రం ఏకంగా 72 దేశాల్లో ఆదరణ పొందింది. 'టోస్టర్' చిత్రం గ్లోబల్ టాప్-10 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది" అని రుచికా వెల్లడించారు.
నెలల తరబడి ప్రమోషన్ల కాలం చెల్లింది
సినిమా విడుదల కాకముందే నెలల తరబడి హడావుడి చేయడం, ఆఫీసుల బయట కలవడాలు, ముందస్తు ప్రచారాలతో ఆసక్తి పెంచే పాత పద్ధతులు ఇక పనిచేయవని రుచికా అభిప్రాయపడ్డారు.
"నేడు సమాచార విప్లవం పెరిగిపోయింది. ప్రేక్షకులు ఒక సినిమా వార్త చదివిన వెంటనే దాన్ని ఓటీటీలో చూసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అందుకే విడుదల ముందే భారీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. నాటి కల్పిత హడావుడిని నేటి ప్రేక్షకులు సులభంగా పసిగడుతున్నారు" అని రుచికా కపూర్ షేక్ పేర్కొన్నారు.
రొటీన్ ఫార్ములా అతిపెద్ద ప్రమాదం
సినిమా పరిశ్రమలో ఒక హిట్ వస్తే వెంటనే దాన్నే ఒక ఫార్ములాగా మార్చేయడం అలవాటైపోయింది. అయితే ఈ ధోరణే పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని రుచికా స్పష్టం చేశారు.
"గతంలో థియేట్రికల్ ప్రొడక్షన్ చూస్తున్నప్పుడు కూడా ఫార్ములా సినిమాలంటేనే నాకు భయం వేసేది. ఒక చిత్రం హిట్ కాగానే, అదే తరహా కథలతో టెంప్లేట్ తయారు చేస్తారు. అంతిమంగా అది ప్లాప్ అవుతుంది. 'సెక్టార్ 36' చిత్రం హిట్ అయ్యాక మా దగ్గరకు 20 ట్రూ క్రైమ్ కథలు వచ్చాయి. కానీ, మేము దేన్నైతే ఇప్పటికే చేశామో, దాన్ని మళ్లీ చేయకూడదని నిర్ణయించుకున్నాం. కొత్తదనం అందించినప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాం" అని ఆమె వివరించారు.
వ్యూస్ కంటే విశ్లేషణలే ముఖ్యం
ఓటీటీలో సినిమా విజయానికి కేవలం వీక్షకుల సంఖ్య మాత్రమే కొలమానం కాదని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ప్రారంభంలో ఎంతమంది చూశారనేది సినిమా కనెక్టివిటీని చెప్తుందని, కానీ సుదీర్ఘ కాలంలో ఆ సినిమా సృష్టించిన చర్చలే నిజమైన విజయమని రుచికా అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు 'మా-బెహన్'
"సినిమా చూశాక ప్రేక్షకుల మధ్య జరిగే సంభాషణలే ముఖ్యం. ఉదాహరణకు 'మా-బెహన్' చిత్రం వచ్చినప్పుడు సమాజంలో రెండు రకాల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక వర్గం తమ ప్రతిబింబంలా ఉందని మెచ్చుకుంటే, మరొక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ తరహా చర్చలు సాగడమే ఆ చిత్రం సాధించిన విజయం. ఒక సినిమా చూశాక దాని పాత్రలు, సంభాషణలు మనసులో నిలిచిపోతేనే అది నిజమైన హిట్" అని రుచికా చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


