Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌కు ఊహించ‌ని షాక్‌..త్వరలోనే ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లు అవుట్..వెంటనే చూసేయండి!

Netflix OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన వ్యూయర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆదరణ పొందిన రెండు పాపులర్ సిరీస్ లను తొలగించనుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సిరీస్ లు ఓటీటీ నుంచి వెళ్లిపోతున్నాయి. మరి ఆ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేయండి.

Published on: Aug 17, 2026, 10:35:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix OTT: కోట్లాది మంది వీక్షకాదరణ పొందిన హాలీవుడ్ ఎపిక్ డ్రామా ‘స్పార్టాకస్’ (Spartacus), పాపులర్ మ్యూజికల్ సిరీస్ ‘నాష్‌విల్లే’ (Nashville) నెట్‌ఫ్లిక్స్ (Netflix) అమెరికా లైబ్రరీ నుంచి నిష్క్రమిస్తున్నాయి. లైసెన్సింగ్ ఒప్పందం ముగియడంతో ఈ రెండు సిరీస్ లను తొలగించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌కు ఊహించ‌ని షాక్‌..త్వరలోనే ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లు అవుట్..వెంటనే చూసేయండి!
నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌కు ఊహించ‌ని షాక్‌..త్వరలోనే ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లు అవుట్..వెంటనే చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ షాక్

నెట్‌ఫ్లిక్స్ తన సబ్ స్క్రైబర్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్.. రెండు పాపులర్ వెబ్ సిరీస్ లైన స్పార్టాకస్, నాష్‌విల్లే ను తొలగించనుంది. సెప్టెంబర్ 14, 2026ను ఈ రెండు షోలను చూడటానికి ఆఖరి తేదీగా నిర్ణయించింది నెట్‌ఫ్లిక్స్.

గత ఏడాది మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ఈ సిరీస్‌లు రికార్డు స్థాయి వ్యూవర్ షిప్ సాధించినప్పటికీ, కేవలం 12 నెలల లైసెన్స్ గడువు ముగియడంతో ప్లాట్‌ఫామ్ నుంచి వెళ్లిపోతున్నాయి.

స్పార్టాకస్

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ స్టార్జ్ ఎపిక్ డ్రామాలోని 4 సీజన్లు (‘బ్లడ్ అండ్ శాండ్’, ‘గాడ్స్ ఆఫ్ ది ఎరీనా’, ‘వెంజియెన్స్’, ‘వార్ ఆఫ్ ది డామ్డ్’) కలిపి నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 259.4 మిలియన్ల వీక్షణ గంటలను (28.4 మిలియన్ వ్యూస్) సాధించాయి. సెప్టెంబర్ 14 అర్ధరాత్రి నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండదు.

నాష్‌విల్లే

కంట్రీ మ్యూజిక్ నేపథ్యంలో సాగే ఈ డ్రామా 6 సీజన్లలో 124 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించింది. నెట్‌ఫ్లిక్స్‌లో 118.6 మిలియన్ వీక్షణ గంటలు (8.1 మిలియన్ వ్యూస్) రాబట్టిన ఈ సిరీస్ సెప్టెంబర్ 14తో తన స్ట్రీమింగ్‌ను ముగిస్తోంది.

ఓటీటీ వ్యాపారంలో సరికొత్త వ్యూహం

గతంలో డిస్నీ, వార్నర్ బ్రదర్స్, లయన్స్ గేట్ వంటి ప్రొడక్షన్ హౌసెస్ తమ కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్‌కు 3 నుంచి 5 సంవత్సరాల అగ్రిమెంట్ తో ఇచ్చేవి. అయితే 2025-2026 కాలంలో స్ట్రీమింగ్ మార్కెట్‌లో ‘షార్ట్-టర్మ్ 12-మంత్స్ లీజింగ్’ ఫార్ములా వేగంగా విస్తరిస్తోంది.

1-ఇయర్ కో-ఎక్స్‌క్లూజివ్ విండో పూర్తయిన వెంటనే కంటెంట్‌ను వెనక్కి తీసుకుని, సొంత ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్లను పెంచుకోవడం లేదా మార్కెట్‌లో ఎక్కువ ధరకు రీ-లైసెన్స్ చేయడం ప్రొడక్షన్ హౌసెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

వెంటనే చూసేయండి

259 మిలియన్ల వీక్షణ గంటలు సాధించినా 12 నెలల్లోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ షోలు తప్పుకోవడం డిజిటల్ లైసెన్సింగ్ ప్రపంచంలో మారుతున్న సమీకరణాలకు నిదర్శనం. నెట్‌ఫ్లిక్స్‌లో థర్డ్-పార్టీ కంటెంట్ చూసే ఆడియన్స్ తమ వాచ్‌లిస్ట్‌లో ఉన్న సిరీస్‌లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయడమే ఉత్తమం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More